తెలంగాణ

విమోచన దినోత్సవానికి అడ్డంకులేమిటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 11: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఎందుకు వెనకాడుతున్నదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే డాక్టర్ కె. లక్ష్మణ్ ప్రశ్నించారు. మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహిస్తున్నప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న ఇబ్బంది ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఈ నెల 17వ తేదీన తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని నాంపల్లిలోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను డాక్టర్ లక్ష్మణ్ ప్రారంభించారు. నాడు సర్దార్ పటేల్ ముందు నిజాం లొంగిపోయిన ఫొటోతో పాటు నాడు నిజాంపై పోరాటం చేసి అసువులుబాసిన వారి ఫొటోలనూ ఈ ప్రదర్శనలో ఉంచా రు. పొటో ప్రదర్శనను ప్రారంభించిన అనంతరం డాక్టర్ లక్ష్మణ్ మీడియా తో మాట్లాడుతూ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ విమోచన దినోత్సవానికి మతం రంగు పులుమవద్దని ఆయన కోరారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని గత ప్రభుత్వ హయాంలో కెసిఆర్ డిమాండ్ చేశారని ఆయన గుర్తు చేశారు. అంతేకాకుండా అధికారం చేపట్టిన తర్వాత అధికారికంగా నిర్వహిస్తామని గత సార్వత్రిక ఎన్నికలకు ముందు వాగ్దానం చేశారని ఆయన గుర్తు చేశారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరి వత్తిడితో విస్మరిస్తున్నారని డాక్టర్ లక్ష్మణ్ ముఖ్యమంత్రి కెసిఆర్‌ను ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు ఎన్. ఇంద్రసేనా రెడ్డి, బద్దం బాల్‌రెడ్డి, పార్టీ నగర శాఖ అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, ఇతర నాయకులు వెంకటరమణి, దాసరి మల్లేషం పాల్గొన్నారు.