తెలంగాణ

ఆగని నిరసనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 11: కొత్త జిల్లాలు, డివిజన్ల ఏర్పాటుపై నిరసనలు, ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. గద్వాల జిల్లాను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం జెఎసి నాయకులు, కార్యకర్తలు ఆదివారం జూరాల ప్రాజెక్టుపై ధర్నా నిర్వహించారు. జూరాల ప్రాజెక్టు దగ్గర ఆత్మకూరు, గద్వాల వైపువెళ్ళే రహదారిని దిగ్బంధించడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. గద్వాల మున్సిపల్ చైర్‌పర్సన్ బండల పద్మావతి, కాంగ్రెస్ నాయకులు గడ్డం కృష్ణారెడ్డి, వెంకట్రాములుతోపాటు గద్వాల నియోజకవర్గం టిఆర్‌ఎస్ ఇన్‌ఛార్జీ కృష్ణమోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ధర్నాలో పాల్గొన్న వారు నల్లజెండాలు చేతిలో పట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కల్వకుర్తి డివిజన్ కోసం చేసిన బంద్ విజయవంతమైంది.
సిరిసిల్ల జిల్లా కోసం..
సిరిసిల్ల జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ జెఎసి నాయకులు ఉద్యమాన్ని ఉధృతం చేశారు. కాగా మంత్రి కెటిఆర్ బహిరంగ లేఖ రాయడంపై జెఎసి నేతలు ఆగ్రహించి, ఆయనకు పిండ ప్రదానం చేశారు. మంత్రి కెటిఆర్‌కు పిండ ప్రదానం చేయడంపై టిఆర్‌ఎస్ నాయకులు సిరిసిల్ల పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సిరిసిల్లను జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం అధ్వర్యంలో ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంతో పాటు వీర్నపల్లి, వెంకటాపూర్‌లో చేపట్టిన నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. కొత్త బస్టాండు వద్ద కామారెడ్డి, కరీంనగర్ ప్రధాన రహదారిపై ధర్నా, రాస్తారోకోలకు దిగారు. హుస్నాబాద్, కోదాడ మండలాలను కరీంనగర్ జిల్లాలో కొనసాగించాలని డిమాండ్ చేస్తూ పరిరక్షణ సమితి అధ్వర్యంలో చేపట్టిన దీక్షలు పక్షం రోజులకు చేరాయి. ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రి కెటిఆర్ మనసు మారాలని గాంధీ చౌక్‌లో రాజన్నకు పూజలు చేశారు.
పరకాల డివిజన కోసం పట్టు
వరంగల్ జిల్లాలో కొత్త జిల్లాల ఏర్పాటు ఉద్యమం సన్నగిల్లినా పరకాల డివిజన్ ఏర్పాటు ఉద్యమం మరింత ఊపందుకుంది. పరకాలను డివిజన్ కేంద్రంగా చేయాలని డిమాండ్ చేస్తూ నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్‌ఛార్జీ ఇనగాల వెంకట్రామ్‌రెడ్డి చేపట్టిన దీక్ష ఆదివారానికి రెండో రోజుకు చేరింది. పరకాల డివిజన్ కోసం ఇనగాల చేపట్టిన నిరసన దీక్షకు టిఆర్‌ఎస్ తప్ప అన్ని పార్టీలూ మద్దతు ప్రకటించాయి.
ఆదిలాబాద్‌లో
దిష్టి బొమ్మల దగ్ధం
ఆదిలాబాద్ జిల్లాను మూడు ముక్కలుగా చేయాలన్న ప్రభుత్వ ఆలోచనను వ్యతిరేకిస్తూ ఆదిలాబాద్ పరిరక్షణ సమితి అధ్వర్యంలో ఆందోళనను ఉధృతం చేశారు. జిల్లాకు చెందిన మంత్రి జోగు రామన్న, ఎంపి నగేష్, ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు, టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు భూమారెడ్డిల ఫ్లెక్సీలకు చీరలు, గాజులు అలంకరించి నిరసన తెలిపారు. జిల్లా విభజన ద్రోహులుగా నినాదాలు చేస్తూ ఫ్లెక్సీలను దగ్ధం చేశారు.