తెలంగాణ

సీమాంధ్ర పోకడ వీడండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, సెప్టెంబర్ 11: అభివృద్ధి ఫలా లు ప్రజలందరికీ అందించేలా ప్రజల జీవన ప్రమాణాలు, సామాజిక ప్రగతి మెరుగుపడే నూతన అభివృద్ధి నమూనా అమలుకు తెలంగాణ ప్రభుత్వంపై ప్రజలంతా ఒత్తిడి చేయాలని టి.జెఎసి చైర్మన్ కోదండరాం పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లా కేంద్రం పిఆర్‌టియు భవన్‌లో తెలంగాణ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన ‘అభివృద్ధి-ప్రజాస్వామ్యం’ సదస్సులో ఆ యన ముఖ్యఅతిధిగా పాల్గొని ప్రసంగించారు. ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్ర పాలకుల అభివృద్ధి విధానాలు తెలంగాణ గ్రామీణ ఆర్ధిక, సామాజిక వ్యవస్థలను, సంస్కృతులను ధ్వంసం చేసి కార్పోరేట్ శక్తుల ఎదుగుదలకు ఉపకరించాయన్నారు. సంపదను కొద్దిమందికే పరిమితమైందన్నారు. 75వేల సూక్ష్మ పరిశ్రమలు మూతపడ్డాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా అదే అభివృద్ధి నమూనా బాటలో కొనసాగడం ఆపివేసి అభివృద్ధి ఫలాలు ప్రజలందరికీ అందించేలా వారి జీవన ప్రమాణాలు పెంచేలా ప్రజల భాగస్వామ్యంతో ప్రజాస్వామ్యయుత నూతన అభివృద్ధి విధానాన్ని ప్రకటించి అమలు చేయాలన్నారు. సీమాం ధ్ర అభివృద్ధి నమూనా వికృత రూపాలే నరుూం, లగడపాటిలని విమర్శించారు. అభివృద్ధి అంటే ఆర్ధికాభివృద్ధి, విదేశీ పెట్టుబడులు, స్థూల ఉత్పత్తి పెరుగుదల మాత్రమే కాదని, ప్రజలందరికి విద్య, వైద్యం, పోషకాహారం, సమాన అవకాశాలు, ఉపాధి కల్పిం చే విధంగా ఉండాలన్నారు. తక్షణం తెలంగాణ ప్రభుత్వం నూతన అభివృద్ధి నమూనా బ్లూఫ్రింట్ ప్రకటించాలన్నారు. అభివృద్ధి విధాన నిర్ణయాలను ఆర్ధిక వేత్తలు, సాంకేతిక నిపుణులు చేయరని రాజకీయాలే వాటి ని నిర్ణయించాలన్నారు. రాష్ట్ర వనరుల దుర్వినియోగం జరుగకుండా ఎత్తిపోతల ప్రాజెక్టులు, అభివృద్ధి పథకాల అమలు జరుగాలన్నారు. ప్రాజెక్టులపై లోతైనా చర్చ జరుగాలని కోరితే అదిగో వారు ప్రాజెక్టులకు వ్యతిరేకమన్న దుష్ప్రచారం సాగిస్తున్న తీరు ప్రభుత్వానికి సరైంది కాదన్నారు. తెలంగాణ అభివృద్ధికి ఎత్తిపోతల పథకాలు అనివార్యమని అదే సమయంలో ప్రజల కష్టనష్టాలు పట్టించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. సంక్షోభంలో ఉన్న రైతాంగానికి ప్రభుత్వం చేయూతనందించాలని, వారికి సబ్సిడీ పథకాలు అందించాలని, రుణాలు మాఫీ చేసి వ్యవసాయ అనుబంధ రంగాలను ప్రొత్సహించాలన్నారు. రైతులు, చేనేతకార్మికుల ఉత్పత్తులకు మార్కెట్ వసతులు, గోదాం లు కల్పించి మద్ధతు ధర అందించాలన్నారు. వరుసగా రెండో ఏడాది కూడా తెలంగాణ రైతాం గం కరువుతో ఆత్మహత్యల దిశగా సాగుతున్నందునా ఇన్‌ఫుట్ సబ్సి డీ బకాయిలు చెల్లించి ఈ ఖరీఫ్ పంటల నష్టాలను అంచనా వేయాలన్నారు. సాగర్ ఎడమకాలువ పరిధిలోని రైతులకు పంటల సా గుకు పూర్థి స్థాయిలో నీరందించాలన్నారు. సాగర్ ఎడమకాలువ రైతుల కష్టనష్టాలను అంచనా వేసేందుకు టి.జెఎసి బృందం త్వరలోనే అక్కడ పర్యటిస్తుందన్నారు.