తెలంగాణ

భూ సేకరణ కోసం కొత్త చట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 12: భూ సేకరణలో సమస్యలు తలెత్తకుండా కొత్త చట్టం తీసుకు రావడానికి ప్రభుత్వం ఐఎఎస్ అధికారులతో కమిటీ వేసింది. జివో 123 ద్వారా భూ సేకరణ చేయడం, కొందరు కోర్టుకు వెళ్లడంతో భూ సేకరణ వివాదాస్పదం కావడంతో వీటిన్నింటిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కొత్త చట్టం తీసుకు రావాలని నిర్ణయించింది. భూ సేకరణ చట్టం తీసుకు రావడానికి ఐఎఎస్‌లతో ఏర్పాటు చేసిన కమిటీకి రెవెన్యూ శాఖ ప్రధాన కార్యదర్శి చైర్మన్‌గా ఉంటారు. ఇరిగేషన్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శి సభ్యులుగా, అడ్వకేట్ జనరల్ ప్రత్యేక ఆహ్వానితునిగా ఉంటారు. కమిటీ సమావేశాలకు అవసరమైతే వివిధ శాఖలకు చెందిన అధికారులను ఆహ్వానించేందుకు ఈ ఉత్తర్వుల్లో అవకాశం కల్పించారు. రాజస్థాన్, కేరళ, గోవా తదితర రాష్ట్రాల్లో భూ సేకరణ చట్టానికి చేసిన సవరణలను పరిగణలోకి తీసుకుంటారు. 1894 భూ సేకరణ చట్టం ప్రకారం తొలుత రాష్ట్రంలో భూ సేకరణ చేశారు. కేంద్రంలో యుపిఏ అధికారంలో ఉన్నప్పుడు 2013 భూ సేకరణ చట్టం తీసుకు వచ్చింది. ఈ రెండు చట్టాల ఆధారంగా రాష్ట్రంలో భూ సేకరణ చేశారు. తెలంగాణ ఏర్పడిన తరువాత ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఈ అంశంపై దృష్టి సారించింది. భూ సేకరణకు ఎక్కువ సమయం పడుతుండడంతో సత్వరం భూ సేకరణ కోసం జివో 123 జారీ చేసింది. ప్రధానంగా ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేసే ఉద్దేశంతో ఈ జివో జారీ చేశారు. ఈ చట్టం ప్రకారం భూ సేకరణకు దశాబ్దాల సమయం పడుతుందని దీని వల్ల అనుకున్న సమయానికి ప్రాజెక్టుల నిర్మాణం సాధ్యం కాదనే ఉద్దేశంతో జివో 123 జారీ చేశారు. నిమ్జ్ ప్రాజెక్టు కోసం భూముల ఈ జివో కింద సేకరించారు. నిర్వాసితులు కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో జివో 123 కింద భూముల సేకరణకు అడ్డంకులు ఏర్పడ్డాయి. నిమ్జ్ వంటి భారీ ప్రాజెక్టు, ఔషధ నగర, భారీ నీటిపారుదల ప్రాజెక్టులు వీటన్నింటి కోసం లక్షల ఎకరాల్లో భూములు సేకరించాల్సి ఉంది.