తెలంగాణ

100 కోట్లతో ఉద్యాన విశ్వవిద్యాలయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 12: వంద కోట్ల రూపాయల వ్యయంతో మెదక్ జిల్లా ములుగులో కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయంను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మించనున్నట్టు తెలంగాణ వ్యవసాయ శాఖ కార్యదర్శి సి పార్థసారథి తెలిపారు. రాజేంద్రనగర్‌లోని ఉద్యాన కళాశాల లో నూతన కళాశాల భవనం, విద్యార్థిని వసతి గృహం భవన నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన పార్థసారథి ఈ విషయం తెలిపారు. ఇటీవల అమెరికాలో వ్యవసాయ స్థితిగతులపై అధ్యయనం చేశామని, అక్కడ రైతులకు వ్యవసాయ విస్తరణ నిపుణులతో సమానంగా వ్యవసాయంపై పరిజ్ఞానం ఉంటుందని చెప్పారు. ఆధునిక యంత్రాలు వాడుతున్నారని, వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని అనుకూలమైన పంటలు వేస్తారని చెప్పారు. మన రైతులకు సైతం ఇలాంటి పరిజ్ఞానం అవసరమని అన్నారు.