తెలంగాణ

తెరాస ద్వంద్వ వైఖరిని ప్రజలు గమనించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 12: తెలంగాణ విమోచన దినోత్సవంపై తెలంగాణ రాష్ట్ర సమితి అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిని ప్రజలు గమనించాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ కోరారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధికారంలోకి రాక ముందు తెలంగాణ విమోచన దినోత్సవం గురించి ఏమన్నారో, అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అంశాన్ని ఎలా పక్కన పెట్టారో ప్రజలకు తెలియజేసేలా రూపొందించిన సిడిని డాక్టర్ లక్ష్మణ్ సోమవారం పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలకు ముందు అధికారంలోకి రాగానే సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుందామని కెసిఆర్ చెప్పారని గుర్తు చేశారు. విమోచనదినోత్సవం నిర్వహించాలంటూ తానే గతప్రభుత్వాన్ని డిమాండ్ చేశారన్నారు. రజాకార్ల అకృత్యాలను వెలుగులోకి తీసుకుని రావాలని అన్నారు.తెలంగాణకు విమోచన లభించిన తర్వాత 50 ఏళ్ళు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అప్పటి నుంచే విమోచన దినోత్సవాన్ని చేపట్టి ఉంటే, ప్రతి ఏడాది కొనసాగేదని ఆయన తెలిపారు.