తెలంగాణ

ప్రాజెక్టులపై వారికి అవగాహన లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్,సెప్టెంబర్ 12: నీటిపారుదల ప్రాజెక్టులపై కాంగ్రెస్ నాయకులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని టిఆర్‌ఎస్ ఎంపిలు బి వినోద్, బాల్కసుమన్ వేరువేరుగా నిర్వహించిన విలేఖరుల సమావేశంలో విమర్శించారు. తెలంగాణభవన్‌లో సోమవారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఎంపిలు మాట్లాడారు. ఉనికి కోల్పోతుందనే భయంతోనే కాంగ్రెస్ నాయకులు ధర్నాలు చేస్తున్నారని ఎంపి వినోద్ విమర్శించారు. 2013 చట్టంను మోడీ ప్రభుత్వం సవరించిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కర్నాటక, కేరళ కూడా భూ సేకరణకు సొంతంగా చట్టాలు చేసుకున్నాయని తెలిపారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ఇతర కాంగ్రెస్ నాయకులకు ఇవి తెలియవా? అని ప్రశ్నించారు. గత ఆరు దశాబ్దాల నుండి తెలంగాణకు అన్యాయం జరిగింది, కృష్ణా, గోదావరి జలాలను బీడుపడిన తెలంగాణ భూములకు మళ్లించాలని ఫ్రభుత్వం ప్రయత్నిస్తుంటే, కాంగ్రెస్ అడ్డుకుంటోందని ఎంపిలు విమర్శించారు. కాకతీయ కెనాల్ హనుమంతుని తోక వలె 350 కిలో మీటర్లు ఉందని, దానిపై మిడ్‌మానేరు తప్ప ఒక్క రిజర్వాయర్ గురించి కూడా కాంగ్రెస్ పాలకులు ఆలోచించలేదని అన్నారు. మల్లన్నసాగర్ ద్వారా నిజామాబాద్, వరంగల్, మెదక్ జిల్లాల్లో కరువు ఉన్నప్పుడు రిజర్వాయర్లలో నీళ్లు నింపుకొని అవసరాన్ని బట్టి ఆ నీటిని తాగు, సాగునీటిగా వాడుకోవచ్చునని తెలిపారు. మూడేళ్లకోసారి తెలంగాణలో కరువు వస్తున్న విషయం తెలియదా? అని ఎంపిలు ప్రశ్నించారు. కేంద్రంలో మంత్రిగా ఉండి కూడా తెలంగాణకు, సొంత జిల్లాకు నియోజక వర్గానికి ఏమీ చేయని కాంగ్రెస్ నాయకుడు ఎస్ జైపాల్‌రెడ్డి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి సహించలేక పోతున్నారని బాల్కసుమన్ విమర్శించారు. రైతులకు అన్యాయం చేసే విధంగా కాంగ్రెస్ నాయకులు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రైతులకు మంచి ప్యాకేజీ ఇవ్వడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే, రైతులకు కష్టాలు మిగిల్చడానికి విపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ఎంపి బాల్కసుమన్ విమర్శించారు.