తెలంగాణ

టోక్యో ఒలింపిక్స్‌కు శిక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 12: క్రీడా శాఖను క్షేత్ర స్థాయిలో అభివృద్ధి పరిచి టోక్యో ఒలింపిక్స్ 2010 లో బంగారు పతకాలే లక్ష్యంగా క్రీడాకారులకు శిక్షణ ఇప్పించాలని క్రీడాశాఖ మంత్రి టి పద్మారావు అధికారులను ఆదేశించారు. క్రీడా, యువజన సర్వీసుల అధికారులతో మంత్రి పద్మారావు సోమవారం సచివాలయంలో సమీక్ష జరిపారు. గచ్చిబౌలిలోని క్రీడా గ్రామంలోని టవర్స్‌ను ఉపయోగించుకోవాలని నిర్ణయించారు. ఒలింపిక్స్ లక్ష్యంగా క్రీడాకారులకు ఏ విధంగా శిక్షణ ఇప్పించాలో చర్చించారు. స్పోర్ట్స్ స్కూల్స్‌ను అభివృద్ధి పరచాలని నిర్ణయించారు. యూత్ సర్వీసెస్‌లో సెట్విన్‌ను అభివృద్ధి చేయాలని, యువతకు ఈ కాలానికి అవసరం అయిన శిక్షణ ఇప్పించేందుకు సెట్విన్‌ను పటిష్టపరచాలని నిర్ణయించారు. నగరంలో మరిన్ని సెట్విన్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామన్నారు. ప్రభుత్వ సలహాదారు పాపారావు, కెవి రమణాచారి, క్రీడల కార్యదర్శి వెంకటేశం, ఎండి దినకర్‌బాబు, సెట్విన్ ఎండి వైద్యనాథ్, ఒఎస్‌డి ఎస్‌ఎం రాజేశ్వరరావు, స్పోర్ట్స్ స్కూల్ ఒఎస్‌డి నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

చిత్రం.. సోమవారం సచివాయలంలో క్రీడలపై అధికారులతో సమీక్షిస్తున్న మంత్రి పద్మారావు