తెలంగాణ

సిఎంను కలవనీయలేదని టవర్ ఎక్కిన నిరుద్యోగి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, సెప్టెంబర్ 12: ఉద్యోగం కోసం సిఎం కెసిఆర్‌ను కలవడానికి ప్రయత్నించిన ఓ యువకుడిని ఎర్రవెల్లి ఫాంహౌస్ వద్ద పోలీసులు అడ్డుకోవడంతో మనస్తాపానికి గురై మెదక్ జిల్లా ప్రజ్ఞాపూర్‌లో టవర్ ఎక్కి నిరసన తెలిపిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన శంకర్ పోలీసు ఉద్యోగంతోపాటు వివిధ పోటీ పరీక్షలు రాసాడు. అయితే తనకు ఉద్యోగం ఇవ్వాలని కోరుతూ సిఎం కెసిఆర్‌ను కలిసే ప్రయత్నం చేయగా, నిరాశే ఎదురవడంతో టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. ఈ సమాచారం తెలుసుకున్న సిఐ సతీశ్, ఎస్‌ఐ కమలాకర్‌లు సంఘటనా స్థలానికి చేరుకొని శంకర్‌కు నచ్చజెప్పి కిందికి దింపడంతోపాటు అదుపులోకి తీసుకున్నారు.