తెలంగాణ

కోదాడ మున్సిపాలిటీకి గోల్డెన్ స్కోచ్ అవార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోదాడ, సెప్టెంబర్ 12: నల్లగొండ జిల్లా కోదాడ మున్సిపాలిటీకి ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ స్కోచ్ జాతీయ అవార్డు లభించింది. మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న చెత్త సేకరణ, రవాణా, రీసైకిలింగ్‌లపై ముంబైలో జరిగిన ఎంపికలో మున్సిపల్ చైర్‌పర్సన్ వంటిపులి అనిత నాగరాజు స్వయంగా ఇచ్చిన పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఆధారంగా కోదాడ మున్సిపాలిటీకి స్కోచ్ సంస్ధ జాతీయస్థాయిలో గోల్డెన్ అవార్డును ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రం నుండి 25 మున్సిపాలిటీలు అవార్డుల కోసం నామినేషన్‌లను సమర్పించినా చివరకు కోదాడలో జరుగుతున్న చెత్త సేకరణ, రవాణా, రీసైక్లింక్‌కు గోల్డెన్ అవార్డు లభించింది. రాష్ట్రంలో గోల్డెన్ స్కోచ్ జాతీయ అవార్డు లభించిన మున్సిపాలిటీ కోదాడ ఒక్కటే కావడం గర్వకారణం. ఈ మున్సిపాలిటీలో నిర్వహిస్తున్న సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్, స్వచ్ఛ్భారత్ కార్యక్రమాలపై స్కోచ్‌కు నామినేషన్‌లను పంపారు. కాగా, కోదాడ మున్సిపాలిటీకి జాతీయస్థాయి, రాష్టస్థ్రాయి అవార్డులు రావడంతో సోమవారం మున్సిపాలిటీలో చైర్‌పర్సన్ అనిత, కమీషనర్ అమరేందర్‌రెడ్డిలను కౌన్సిలర్‌లు వాడపల్లి వెంకటేశ్వర్లు, షేక్ నరుూమ్, ఖాజాగౌడ్, లక్ష్మినారాయణ, సైదిబాబు, కాంపాటి శ్రీను, గురుమూర్తి, ఎఇ సత్యారావు, శానిటరీ ఇన్స్‌పెక్టర్ యాదగిరి, సిబ్బంది ఘనంగా సన్మానించారు.