అంతర్జాతీయం

ఐరాసకు సహకరించని దేశాల సంఖ్య పెరుగుతోంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జెనీవా, సెప్టెంబర్ 13: మానవ హక్కుల విషయంలో ఐక్యరాజ్య సమితితో సహకరించడానికి నిరాకరిస్తున్న దేశాల సంఖ్య పెరుగుతోందని ఐరాస హెచ్చరిస్తూ సిరియా, ఇరాన్, వెనిజులాలాంటి అనేక దేశాల్లో పరిస్థితుల పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
‘దేశాలు మా కార్యాలయాలను మూసివేయవచ్చునేమో కానీ మా నోళ్లనుకానీ, మా కళ్లను కానీ మూసేయలేవు’ అని మంగళవారం ఇక్కడ ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంఘం 32వ సమావేశాన్ని ప్రారంభిస్తూ సంఘం అధ్యక్షుడు జీద్ రాడ్ అల్ హసన్ అన్నారు. ఐరాస మానవ హక్కుల సంఘం ఉద్యోగులను, మానవ హక్కుల ఉల్లంఘనల సంఘటనలపై దర్యాప్తు చేయడానికి ఐరాస నియమించిన ప్రతినిధులను తమ దేశంలోకి అనుమతించని దేశాల సంఖ్య రానురాను పెరగడం పట్ల జీద్ ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా సిరియాలో పరిస్థితి తీవ్ర ఆందోళన కలిగిస్తోందని ఆయన అంటూ, 2011 మార్చిలో ఇక్కడ అంతర్యుద్ధం చెలరేగినప్పటినుంచి ఐరాసకు చెందిన మానవ హక్కుల పర్యవేక్షకులెవరినీ ఆ దేశం అనుమతించడం లేదన్నారు.
ఒక వైద్యుడు నాయకత్వం వహిస్తున్నప్పటికీ అక్కడి ప్రభుత్వం తన ప్రజలపై ప్రాణాంతక వాయువులను ప్రయోగిస్తోందని ఆయన అన్నారు. అలాగే ఆస్పత్రులపైన, నివాస ప్రాంతాలపైన దాడులు చేయడాన్ని, వేలాది మందిని అమానుషమైన రీతిలో నిర్బంధించడాన్ని సైతం ఆయన ఖండించారు.
అలాగే గత రెండున్నరేళ్లుగా తమ ప్రతినిధులకు వీసా జారీ చేయడానికి సైతం నిరాకరిస్తున్న వెనిజులా తీరును సైతం ఆయన దుయ్యబట్టారు. ఇరాన్‌కూడా 2013నుంచి తమ సిబ్బందిని దేశంలోకి అనుమతించడం లేదన్నారు. బెలారస్, ఎరిట్రీయా, ఉత్తర కొరియాలాంటి దేశాలు సైతం ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంఘం ప్రతినిధులను అనుమతించడం లేదని, ఆక్రమిత పాలస్తీనా భూభాగాల్లో పరిస్థితిని పరిశీలించడానికి ఇజ్రాయెల్ సైతం తమతో సహకరించడం లేదని ఆయన చెప్పుకొచ్చారు. అయితే తమను అనుమతించనంతమాత్రాన తాము కళ్లు మూసుకుని కూర్చోబోమని ఆయన స్పష్టం చేస్తూ, ‘మమ్మల్ని అనుమతించకపోతే పరిస్థితి దారుణంగా ఉందనే మేము భావిస్తాము’ అని స్పష్టం చేశారు.