ఆంధ్రప్రదేశ్‌

విద్యుత్‌లో ఏపికి రెండో స్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 13: దేశంలో గుజరాత్ తర్వాత వంద శాతం విద్యుత్‌ను సరఫరా చేసే స్థానాన్ని ఆంధ్రప్రదేశ్ దక్కించుకుందని, రాష్ట్రంలో ఇంధన రంగాన్ని పటిష్ఠం చేసేందుకు రెండు వేల కోట్లరూపాయలతో ప్రణాళిక ఖరారు చేయనున్నట్లు ఇంధన శాఖ కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. విద్యుత్ లోటు నుంచి మిగులు దశకు చేరుకున్నామని ఆయన చెప్పారు. దేశంలో 35 శాతం గృహాలక విద్యుత్ సదుపాయం లేని స్ధితిల్లో ఆంధ్రాలో వంద శాతం గృహ విద్యుదీకరణ పూర్తయిందన్నారు. త్వరలో జరగనున్న జిల్లా కలెక్టర్ల సదస్సులో విద్యుత్ ప్రగతి ప్రణాళికలపై సమీక్షించి అంచెల వారీగా ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించినట్లు చెప్పారు. ప్రసుతతం 10.5 శాతంగా ఉన్న విద్యుత్ పంపిణీ , సరఫరా నష్టాలను సింగిల్ డిజిట్‌కు తగ్గించాలని, సాంకేతిక కారణాలతో విద్యుత్ అంతరాయం ఏర్పడ్డ వెంటనే పునరుద్ధరించాలని, ఈ పునరుద్ధరణ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని అజయ్ జైన్ తెలిపారు. రాష్ట్రంలో పదివేల వరకు 11కెవి ఫీడర్లు ఉన్నాయని, వీటిలో లోపాలను సరిదిద్దనున్నట్లు చెప్పారు. విద్యుత్ సేకరణ వ్యయాన్ని కనీసం యూనిట్‌కు 30-40 పైసలు వరకు తగ్గించాలని, తద్వారా చవకైన విద్యుత్‌ను అందించననున్నట్లు చెప్పారు. వినియోగదారుడు కోరిన వెంటనే విద్యుత్ కనెక్షన్ ఇస్తామన్నారు. రాయలసీమలో వర్షాభావ ప్రాంతాల్లో 24 గంటల పాటు వ్యవసాయానికి కరెంటు ఇచ్చామన్నారు.
దీనికి అదనంగా 800 మెగావాట్ల విద్యుత్ కేటాయించినట్లు ఆయన చెప్పారు.