తెలంగాణ

భగీరథ పనులు భేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి/ వరంగల్, జనవరి 20: దేశానికే ఆదర్శవంతంగా నిలిచేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పనులు రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు కాదు...బుల్లెట్ రైలులా శరవేగంతో దూసుకుపోతున్నాయని, అధికార యంత్రాంగం ఎంతో శ్రమిస్తోందని, మరింత ఒత్తిడి తీసుకువచ్చి నిర్ణిత కాల వ్యవధి నాటికి ఇంటింటికి నల్లా నీరు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ పేర్కొన్నారు. బుధవారం మెదక్, వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లో కొనసాగుతున్న మిషన్ భగీరథ పనులను పరిశీలించడానికి బయలుదేరిన గవర్నర్ ముందుగా గజ్వేల్ మండలం కోమటిబండ గుట్టపై 14 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో నిర్మిస్తున్న సంప్‌హౌస్ పనులను పరిశీలించారు. హెలికాప్టర్‌లో వచ్చిన గవర్నర్‌కు పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్‌పి సింగ్, కలెక్టర్ రొనాల్డ్ రాస్‌లు స్వాగతం పలికి గుట్టపైకి తీసుకెళ్లారు. సంప్‌హౌస్ నిర్మాణం తీరుతెన్నులను, నియోజకవర్గాల వారీగా భగీరథ పథకం కింద సరఫరా చేయనున్న నీటి విధానంపై సవివరంగా వివరించారు.
ఈ పనులను పరిశీలించిన అనంతరం గవర్నర్ వరంగల్ జిల్లా సరిహద్దు తపాస్‌పల్లిలో కొనసాగుతున్న పనులను, మెదక్ జిల్లా రవీంద్రనగర్‌లో 12 లక్షల క్యూసెక్కుల సామర్థ్యంతో నిర్మిస్తున్న సంప్‌హౌస్ పనులను, నల్లాలను పరిశీలించారు. అంతకుముందు కోమటిబండ వద్ద విలేఖరులు, అధికారులను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ మాట్లాడారు. సామాన్యులకు మేలు జరిగే మిషన్ భగీరథ తాగునీటి ప్రాజెక్టు అతి పెద్దదన్నారు. ప్రతి వ్యక్తికి రోజుకు వంద లీటర్ల చొప్పున స్వచ్చమైన మంచినీరు అందించడం గొప్ప కార్యక్రమంగా పేర్కొన్నారు. రానున్న మూడేళ్లలో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఇంటింటికి నీటిని అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్లడం సంతోషకరమన్నారు.
కరెంటు అవసరాలు లేకుండా తక్కువ ఖర్చుతో చేపడుతున్న మిషన్ భగీరథ కార్యక్రమం దేశానికే ఆదర్శమన్నారు. అవసరమైన మేరకు నీటిని వాడుకోవాలని, మిగిలిన నీటిని ఇతరులకు ఉపయోగపడేలా ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని పిలుపునిచ్చారు.ప్రభుత్వం అంటే సిఎం కెసిఆర్‌దిగా భావించకూడదని, ప్రజలు ఎన్నుకుంటేనే ప్రభుత్వం ఏర్పడుతుందని, ప్రజాహిత కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వామ్యం అయినప్పుడే ఏ కార్యక్రమమైనా విజయవంతం అవుతుందన్నారు. మిషన్ భగీరథ పనులను రాష్ట్ర వ్యాప్తంగా పరిశీలిస్తానని అన్నారు. ఏప్రిల్ 30 నాటికి మొదటి విడత నీటి సరఫరా చేసే భగీరథ పనులను చూడాలన్న తాపత్రయంతో వచ్చినట్లు చెప్పారు. చేపట్టిన పనులు సంతృప్తికరంగా ఉన్నాయని, రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలుకంటే వేగంగా బుల్లెట్ రైలులా దూసుకుపోతున్నాయని అన్నారు. అధికారులంతా బాధ్యతగా పని చేస్తున్నారని కితాబిస్తూ మరింత ఒత్తిడి తీసుకువచ్చి నిర్ణీత కాలానికి నీటి సరఫరా చేయిస్తామన్నారు. త్వరలోనే పథకం ప్రారంభానికి వస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎజెసి వెంకటేశ్వర్లు, సిద్దిపేట ఆర్డీవో ముత్యంరెడ్డి, మిషన్ భగీరథ ఎస్‌ఇ విజయ్ ప్రకాష్ ఇతర అధికారులు పాల్గొన్నారు.
అనంతరం గవర్నర్ వరంగల్ జిల్లా చేర్యాల మండలం కొమురవెల్లి కమాన్ వద్ద నిర్మిస్తున్న ఓవర్‌హెడ్ బ్యాలెన్సింగ్ ట్యాంక్ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈసందర్భంగా అధికారులను పనులకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. దాదాపు రూ.840కోట్ల అంచనా వ్యయంతో జరుగుతున్న ఈ పనుల ద్వారా జనగామ నియోజకవర్గంతో పాటు పాలకుర్తి, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గాలలోని మొత్తం 11 మండలాలకు తాగునీరు అందించనున్నట్లు అధికారులు గవర్నర్‌కు తెలిపారు.ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ఈ వాటర్ గ్రిడ్ పనులను త్వరితగతిన నాణ్యతతో పూర్తి చేయాలని గవర్నర్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ ,్భవనగిరి ఎంపి బూర నర్సయ్యగౌడ్, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు, కలెక్టర్ వాకాటి కరుణ, జెడ్పీ చైర్మన్ గద్దల పద్మ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం... వరంగల్ జిల్లాలో పనులు పరిశీలిస్తున్న గవర్నర్