తెలంగాణ

శివన్నగూడెం, సీతారామ ప్రాజెక్టుల టెండర్లు రద్దు చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 13: డిండి ప్రాజెక్టు పరిధిలో నిర్మిస్తున్న శివన్న గూడెం, సీతారామా జలాశయాల టెండర్లు రద్దు చేయాలని ఎఐసిసి కార్యదర్శి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు పొంగులేటి మంగళవారం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు లేఖ రాశారు. కాంట్రాక్టు సంస్థలు అంచనాలు పెంచి టెండర్లు వేశాయని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. వేల కోట్ల రూపాయలతో చేపడుతున్న ప్రాజెక్ట పనుల్లో అవకతవకలు జరిగాయని ఆయన ఆరోపించారు. కాబట్టి దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. నివేదిక వచ్చేంత వరకు టెండర్లు రద్దు చేయాలని ఆయన తెలిపారు. ఆ తర్వాత టెండర్లు కొత్తగా పిలవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

సంప్రదాయేతర ఇంధన
వనరులపై 15న సదస్సు

హైదరాబాద్, సెప్టెంబర్ 13: తెలంగాణలో సంప్రదాయేతర ఇంధన వనరుల అభివృద్ధిపై ఈ నెల 15వ తేదీన సదస్సును నిర్వహించనున్నట్లు భారతీయ పరిశ్రమల సమాఖ్య (సిఐఐ) ప్రకటనలో తెలిపింది. ఐక్యరాజ్య సమితి పరిశ్రమల అభివృద్ధి సంస్థ (యుఎన్‌ఐడివో) అంతర్జాతీయంగా పర్యావరణ వ్యవస్థపై సదస్సులను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా సంప్రదాయేతర ఇంధన వనరులతో విద్యుత్‌ను ఉత్పత్తి చేసి కాలుష్యాన్ని తగ్గించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా సౌర టెక్నాలజీని అభివృద్ధి చేయాలని ఈ సంస్ధ నిర్ణయించింది. దీనిపై దేశంలో వివిధ రాష్ట్రాల్లో అవగాహన పెంచడం, సౌర విద్యుత్ వల్ల వచ్చే లాభాలపై సదస్సులను నిర్వహిస్తున్నట్లు సిఐఐ తెలిపింది.