తెలంగాణ

హైదరాబాద్‌లో కుండపోత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 14: హైదరాబాద్ నగరంలో బుధవారం రాత్రి కుండపోత వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. నగరంలోని చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అమీర్‌పేట, ఉప్పల్, కుత్బుల్లాపూర్, తిరుమలగిరి, మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్, చిక్కడపల్లి, అబిడ్స్, పంజాగుట్ట తదితర ప్రాంతాల్లో రాత్రి 7గంటల నుంచి 11 గంటల వరకు ఏకధాటిగా భారీ వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించడంతో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉరుములు, మెరుపులతో భారీ వర్షం పడడంతో లోతట్టు ప్రాంతాల ఇండ్లలోకి నీరు చేరింది. రంగారెడ్డి జిల్లాలో కొత్తగడి వాగు వద్ద నిలిచిన వాహనాలు, రైలు పట్టాలపైకి వర్షం చేరడంతో బీదర్-హైదరాబాద్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌కు ప్రమాదం తప్పింది. రంగారెడ్డి జిల్లా ధారూర్ మండలం చింతపల్లి వద్ద భారీ వర్షానికి ఓ వాహనంపై వెళ్తున్న భార్య, భర్తలు కొట్టుకుపోతుండగా వీరిని గ్రామస్తులు కాపాడారు. అదేవిధంగా రంగారెడ్డి జిల్లా బంట్వారంలోని మధువాపూర్ వాగు వద్ద ఓ ఇండికా కారు కొట్టుకుపోయింది. కారులోని ఆరుగురు వ్యక్తులు గల్లంతయ్యారు. వీరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఉప్పల్‌లో 7 సెం.మీ, బండ్లగూడలో 4.75 సెంమీ, నారాయణగూడలో 3.2 సెం.మీ వర్షపాతం నమోదైంది. మూసీ పరీవాహక ప్రాంతమంతా వరద నీటితో బురదమయమైంది. ఐదుగంటల పాటు ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షానికి నగరమంతా అతలాకుతలమైంది.