తెలంగాణ

ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షం ఉప్పొంగిన వాగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, సెప్టెంబర్ 14: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంగా బుధవారం జిల్లాలో 6 సెం.మీటర్ల వర్షపాతం నమోదైంది. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహించగా చెరువులు, జలాశయాలకు వరదనీరు వచ్చిచేరడంతో జలకళను సంతరించుకుంది. ఇప్పటివరకు జిల్లాలో సాధారణ వర్షపాతం 952 మి.మీటర్లు నమోదు కావాల్సి ఉండగా అంతకుమించి 960 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. తలమడుగు, ఆదిలాబాద్, గుడిహత్నూర్, జైనథ్, తాంసి మండలాల్లో 7 సెం.మీటర్ల వర్షపాతం నమోదు కాగా మిగతా 42 మండలాల్లో 5 నుండి 6.5 సెం.మీటర్ల వర్షపాతం నమోదయంది. 20 రోజులుగా వర్షాలుకోసం ఏడాదిగా ఎదురుచూస్తున్న రైతులకు భారీ వర్షాలు ఊపిరి పోశాయి. జిల్లాల్లో 6.60 లక్షల ఎకరాల్లో సాగుచేసిన పత్తిపంటకు, 3.2లక్షల ఎకరాల్లో సాగుచేసిన సోయాబీన్, కంది పంటలకు ఈ వర్షాలు ఎంతగానో అనుకూలించాయని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. మరో రెండు రోజుల పాటు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు పేర్కొనడంతో జిల్లా యంత్రాంగం అప్త్రమత్త చర్యలకు సిద్దమైంది.
నల్లగొండ జిల్లాలో ...
నల్లగొండ: జిల్లా వ్యాప్తంగా 58 మండలాల్లో వర్షాలు పడగా సగటు 19.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇప్పటికే నిండిన చెరువులు, కుంటలు అలుగుపోశాయి. జంటనగరాల్లో కురిసిన వర్షాలతో పోచంపల్లి, బీబీనగర్, వలిగొండ మండలాల్లో మూసీనది కత్వల మీదుగా పొంగిపొర్లగా కాలువలకు నీటి విడుదల కొనసాగింది. మక్తానంతారం, ధర్మారెడ్డిపల్లి, భీమలింగం, అసఫ్‌నహర్ కత్వల మీదుగా మూసీ వరద ఉధృతి కొనసాగింది. కేతెపల్లి మూసీ ప్రాజెక్టు నీటి మట్టం పూర్తి స్థాయికి చేరువైంది. పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతంలో నల్లగొండ-గుంటూరు జిల్లాల్లో వర్షాలతో వరద ఉధృతితో మూసీ నది, దాని అనుబంధ వాగులు, దుర్గి, మాచర్ల, రెంటచింతలతో పాటు పలువాగుల నీరుకూడా కృష్ణానది ద్వారా ప్రాజెక్టులో చేరుతోంది. దీంతో పులిచింతల ప్రాజెక్టులో నీటి నిల్వ సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నుండి నీటి విడుదల లేకుండానే స్థానికంగానే లభ్యమైన వరదలతో 22 టిఎంసిలకు చేరడం గమనార్హం.

ఆలూరు గ్రామ త్యాగాలను
విస్మరిస్తున్న సర్కారు

బలవంతంగా గ్రామం ఖాళీని నిలిపివేయాలి
నిర్వాసితులకు అండగా ఉంటాం: ఎమ్మెల్యే అరుణ

గద్వాల, సెప్టెంబర్ 14: మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల డివిజన్ పరిధిలోని నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగంగా ర్యాలంపాడు రిజర్వాయర్‌లో ముంపునకు గురవుతున్న ఆలూరు గ్రామ ప్రజల త్యాగాలను ప్రభుత్వం విస్మరిస్తోందని, అధికారులు, పోలీసు బలగాలను మోహరించి గ్రామాన్ని బలవంతంగా ఖాళీచేయడం రాక్షసత్వమని మాజీ మంత్రి, గద్వాల ఎమ్మెల్యే డికె అరుణ మండిపడ్డారు. ఈ ప్రాంత ప్రజలు ఎంతో త్యాగంచేసి ప్రాజెక్టు నిర్మాణానికి ముందుకొచ్చారన్న విషయాన్ని ప్రభుత్వం గ్రహించాలన్నారు. ఆలూరు గ్రామస్థుల సమస్యలు తెలుసుకునేందుకు బుధవారం వచ్చిన ఆమె విలేఖరులతో మాట్లాడుతూ ర్యాలంపాడు రిజర్వాయర్‌లో గత నాలుగేళ్లుగా నీటిని నిలుపుతున్నామని, గ్రామస్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతోపాటు ప్రభుత్వం అందించాల్సిన నష్టపరిహారం చెల్లించి ఖాళీ చేయిస్తే బాగుంటుందన్నారు. ఒక పక్క వర్షాలు, మరోపక్క మోటార్ల ద్వారా నీటిని పంపింగ్ చేస్తూ గ్రామం ఇళ్ల్లల్లోకి నీటిని వదిలి ఖాళీ చేయాలని బలవంతం చేయడం సరైంది కాదన్నారు. ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటిమట్టం నిల్వచేసి ఈ ప్రాంత రైతులను ఆదుకునేందుకు తాము కూడా సానుకూలమేనని ఆలూరు గ్రామస్థులను కంటతడిపెట్టించి నీటిని నిలపడం విచారకరమన్నారు. గ్రామస్థులకు ప్రభుత్వం అందిస్తున్న డబుల్‌బెడ్‌రూం పథకాన్ని మంజూరు చేయాలని, గతంలో ఉన్న ప్రభుత్వ ధరల ప్రకారం నష్టపరిహారం అందించిందని, వాటిని పెంచి గ్రామస్థులను ఆదుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఆలూరు గ్రామస్థుల సమస్యలపై తాము ప్రభుత్వంపై ఒత్తిడితెస్తామని, గ్రామస్థులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. పునరావాస కేంద్రంలో సౌకర్యాలు లేవని, తాగునీటికి కటకట ఉందని వాపోయారు. వారం రోజులుగా మోటార్ల పంపింగ్‌ను నిలిపివేయడం లేదని, నీరు ఇళ్లలోకి చొచ్చుకొచ్చి విషపురుగులు సంచరిస్తున్నాయని రోదించారు. చలించిన ఎమ్మెల్యే ఈ విషయంపై జాయింట్ కలెక్టర్‌తో మాట్లాడి సమస్య పరిష్కారాన్ని వేగవంతం చేయాలని సూచించారు. ఎమ్మెల్యే వెంట నాయకులు గడ్డం కృష్ణారెడ్డి, నందినె్న ప్రకాష్‌రావు, నాగేందర్‌రెడ్డి, శంకర్, రామాంజనేయులు, తిమ్మన్న, విక్రంసింహారెడ్డి, మహేశ్వర్‌రెడ్డి, చక్రాధర్‌రెడ్డి, జయసింహారెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

హార్టికల్చర్ వర్సిటీ నిర్మాణాలను
18 నెలల్లో పూర్తి చేస్తాం
వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి

ములుగు, సెప్టెంబర్ 14: ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు కలలను సాకారం చేయాలన్న ఉద్దేశంతో హార్టికల్చర్ యూనివర్సిటీ భవనాల నిర్మాణాన్ని 18 నెలల్లో పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తామని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. మెదక్ జిల్లా ములుగు వద్ద బుధవారం ఉదయం 8.30 గంటలకు కొండా లక్ష్మణ్ హార్టికల్చర్ యూనివర్సిటీ భవనాల నిర్మాణానికి ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డితో కలిసి ఆయన భూమిపూజ చేశారు. యూనివర్సిటీ భవన నిర్మాణ నమూనా చిత్రపటాన్ని పరిశీలించిన అనంతరం అటవీ పరిశోధనా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. మొదటి విడతగా రూ.95 కోట్లతో పరిపాలనా భవనం, తరగతి గదులు, సిబ్బందికి గృహ సముదాయాల నిర్మాణాలను 18 నెలల్లో పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామన్నారు. ఐదేళ్లలో యూనివర్సిటీని అన్ని హంగులతో పూర్తిస్థాయిలో నిర్మించి ఇస్తామని తెలిపారు. రూ.11 కోట్లతో రైతులకు సబ్సిడీ ద్వారా అందించే కూరగాయ విత్తనాలు, నారును అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో హార్టికల్చర్ యూనివర్సిటీ వైస్‌చాన్సలర్ పార్థసారధి, రిజిస్ట్రార్ ప్రతాప్, ఎస్టేట్ ఆఫీసర్ (లెఫ్ట్‌నెంట్ కల్నల్) పి. రాంప్రసాద్‌రాజు, కంట్రోలర్ రవీందర్‌రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాములు, గఢా హన్మంతరావు, ఎఎంసి చైర్మన్ జహంగీర్, జడ్పీటిసి సభ్యుడు సింగం సత్తయ్య, సర్పంచ్‌లు కైలాసం, సుగుణాకర్‌రెడ్డి, సురేశ్‌గౌడ్, అర్జున్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.