ఆంధ్రప్రదేశ్‌

వైకాపా తోక కట్ చేస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబరు 15:రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేస్తానన్న భరోసాతో ప్రజలు తనకు పట్టం కట్టారని, ఎవరైనా అభివృద్ధికి అడ్డుతగిలితే తోక కట్ చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నా రు. మాజీ మంత్రి దేవినేని నెహ్రూ, అతని కుమారుడు అవినాష్, కడియాల బుచ్చిబాబు గురువారం చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ప్రజా సమస్యలపై చర్చించాల్సిన అసెంబ్లీని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ స్తంభింప చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. బెంచీలెక్కి గందరగోళం సృష్టించారని అన్నారు. ప్రతిపక్ష పార్టీ వారు ఉన్మాదులుగా తయారయ్యారని అన్నారు. వైకాపాకు సరైన నాయకత్వం లేదని, అందుకే ఆపార్టీ వారంతా ఉన్మాదులుగా తయారవుతున్నారని చంద్రబాబు అన్నారు. కాకినాడలో దివీస్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తే వైకాపా అడ్డుపడుతోందని, కానీ వారి ఆటలు సాగనీయనని, తోక కట్ చేస్తానని చంద్రబాబు అన్నారు. రాజధాని నిర్మాణంలో 56 వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ప్రతిపక్షాలు వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉందని అన్నారు. ‘నా రాజకీయ అనుభవం అంత లేదు ప్రతిపక్ష నాయకుడి వయసు’ అని చంద్రబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్ నా కుటుంబం, ప్రజలు నా కుటుంబ సభ్యులు. వారికి ఏ నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత నాపై ఉంద’ని అన్నారు.
విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్‌కు రావల్సినవన్నీ రాబట్టడానికి తాను నిరంతరం కేంద్రంతో పోరాడుతునే ఉంటానని చంద్రబాబు అన్నారు. హోదాకు బదులు దానికి సరిసమానమైన ప్యాకేజీ ఇస్తామని కేంద్రం చెప్పిందని, అన్నీ తెలిసిన వ్యక్తిగా తాను అందుకు అంగీకరించాల్సి వచ్చిందని చెప్పారు. ఏపికి రావల్సిన ప్రతి పైసా రాబడతానని, తనది ఉడుంపట్టు అని అన్నారు.
వెంకనే్న నన్ను కాపాడాడు
అలిపిరిలో తనపై దాడి జరిగినప్పుడు తిరుమల వెంకటేశ్వరుడే తనను కాపాడాడని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. 24 క్లెమోర్ మైన్స్ పెట్టి తనను హతమార్చాలనుకున్నారని, దేవుడి దయవలన తప్పించుకుననాన్నిన ఆయన చెప్పారు. అంతకుముందు దేవినేని నెహ్రూ మాట్లాడుతూ పట్టిసీమ ప్రాజెక్ట్ ప్రారంభించినప్పుడు తాను చంద్రబాబు చర్యలను తప్పుపట్టానని, సంవత్సరంలోగా ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తే, ఆయనను ఘనంగా సన్మానిస్తానని ఆనాడు చెప్పాను. అదే ఇప్పుడు నిజమైందనుకుంటున్నానని నెహ్రూ అన్నారు. అమరావతికి రక్షణ కవచంగా తాము ఎప్పుడూ ఉంటామని నెహ్రూ చెప్పారు. తెలుగుదేశం ఆవిర్భావానికి ముందునుంచి ఎన్టీఆర్‌తో కలిసి పనిచేశానని, అప్పుడే తాను టిడిపి జెండా కప్పుకునే చనిపోవాలని నిర్ణయించుకున్నానని అన్నారు. అయితే అనుకోని పరిస్థితుల్లో టిడిపిని వదిలి కాంగ్రెస్‌లోకి కంట తడితోనే వెళ్లానని ఆయన అన్నారు. తను మనస్ఫూర్తిగా కాంగ్రెస్‌లో చేరలేదని ఆయన అన్నారు.

చిత్రం... పార్టీ కండువా కప్పి దేవినేని నెహ్రూని టిడిపిలోకి ఆహ్వానిస్తున్న చంద్రబాబు