తెలంగాణ

తెలంగాణ సచివాలయం ముట్టడికి యత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 26: కేంద్రీయ విశ్వవిద్యాలయం రీసెర్చ్ స్కాలర్ రోహిత్ ఆత్మహత్యపై హెచ్‌సియూ విద్యార్థుల ఆందోళనకు మద్దతుగా మంగళవారం ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు తెలంగాణ సచివాలయం ముట్టడికి యత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఉస్మానియా విశ్వవిద్యాలయం జెఎసి ఆధ్వర్యంలో కొందరు విద్యార్థులు పీపుల్స్ ప్లాజా నుంచి సచివాలయానికి ర్యాలీగా వస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా ట్యాంక్‌బండ్ నుంచి సచివాలయానికి ర్యాలీగా వెళ్లిన విద్యార్థులను పోలీసులు అరెస్టు చేసి సమీపంలోని పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా విద్యార్థి జెఎసి నాయకులు మాట్లాడుతూ రోహిత్ ఆత్మహత్యపై సిటింగ్ జడ్జిచే న్యాయ విచారణ జరిపించాలని, హెచ్‌సియు విసి అప్పారావును సస్పెండ్ చేయాలని, రోహిత్ కుటుంబానికి 50 లక్షల పరిహారంతో పాటు, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. హెచ్‌సియూ విద్యార్థుల ఆందోళనకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని, రోహిత్ ఆత్మహత్యకు బాధ్యులపై చర్య తీసుకునేంత వరకు తమ ఆందోళన కొనసాగుతుందని హెచ్చరించారు.
రోహిత్ కుటుంబానికి ఐదు లక్షల సాయం
ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థి రోహిత్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని టిపిసిసి అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. మంగళవారం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీని సందర్శించిన ఆయన రోహిత్ తల్లి రాధికకు కాంగ్రెస్ పార్టీ తరఫున ఐదు లక్షల చెక్కును అందజేశారు.

పప్పుల విషయంలో తప్పుచేస్తే ఊరుకోం

రీసైక్లింగ్ చేస్తే పనిపడతాం నాసిరకం విక్రయిస్తే చర్యలు మిల్లర్లను హెచ్చరించిన మంత్రి ఈటల

హైదరాబాద్, జనవరి 26: మార్కెట్‌లో నాసిరకం, కల్తీ పప్పులను విక్రయించే వ్యాపారులు, డీలర్లపై కఠిన చర్యలు తీసుకోనున్నట్టు పౌరసరఫరా శాఖ మంత్రి ఈటెల రాజేందర్ హెచ్చరించారు. సబ్సిడీ ధరపై పేదలకు అందిస్తున్న పప్పును కొంతమంది మిల్లర్లు, డీలర్లతో కుమ్మక్కై రీసైక్లింగ్ చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని మంత్రి గుర్తు చేశారు. అలాంటివారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని, పౌరసరఫరాల శాఖ నిఘా పెట్టిందని మంత్రి హెచ్చరించారు. సచివాలయంలో మంగళవారం పప్పు మిల్లర్లతో మంత్రి ఈట ల రాజేందర్ సమావేశమయ్యారు. ప్రభుత్వానికి నాణ్యమైన పప్పు సరఫరా చేయాలని, ధర విషయంలో మిల్లర్లతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు.
మార్కెట్‌లో కొరత ఏర్పడకుండా స్థానికంగా పండించే పప్పును మిల్లర్లు కొనుగోలు చేయాలని మంత్రి సూచించారు. నాసిరకం, కల్తీ పప్పును ఎక్కడ విక్రయించినా కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా పౌరసరఫరాల శాఖ అధికారులను ఆయన ఆదేశించారు.