తెలంగాణ

జిల్లాల దిద్దుబాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 15:‘జిల్లాల పునర్విభజన దేనికోసమైతే జరుగుతోందో ఆ పరమార్థం నెరవేరాలి. ఇది ప్రజల సెంటిమెంట్‌తో కూడుకున్న అంశం. లోతైన అధ్యయనం లేకుండా కొందరు అధికారులు గణాంకాలతో మొక్కుబడి నివేదికలు ఇచ్చారు. ముసాయిదాలో జరిగిన తప్పిదాలను తుది నోటిఫికేషన్‌లో అయినా సరిదిద్దాలి’- ఇటీవల రెవిన్యూ ఉన్నతాధికారులు, కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో సిఎం కెసిఆర్ చేసిన వ్యాఖ్యలు ఇవి. జిల్లాల పునర్విభజన కసరత్తు కొన్ని జిల్లాల్లో సరిగ్గా జరగలేదని ముఖ్యమంత్రి స్వయంగా అసంతృప్తి వ్యక్తం చేయడంతో లోపాలను తుది నోటిషికేషన్‌లోనైనా సరిదిద్దడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. పరిపాలన వికేంద్రీకరణ, ప్రజలకు అందుబాటులో పాలన ఈ రెండింటికి అనుగుణంగా భౌగోళిక స్వరూపం, విస్తీర్ణం, జనాభా దాదాపు మెజారిటీ జిల్లాల్లో ఏకరూపంగా ఉండే విధంగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. జిల్లాల సంఖ్య ఎంత అనేది రాజకీయ నిర్ణయం కావడంతో వాటి జోలికి వెళ్లకుండా జిల్లాలు, డివిజన్లు, మండలాల కూర్పును తుది నోటిషికేషన్‌లో సరి చేయడంపై భూ పరిపాలన కమిషనర్ కార్యాలయం దృష్టి సారించింది. తమ మండలాలను ప్రతిపాదిత యాదాద్రి జిల్లాల్లో చేర్చవద్దని వరంగల్ జిల్లా జనగామ నియోజకవర్గానికి చెందిన ప్రజలు కోరుతున్నారు. అలాగే అలంపురం, గద్వాల, దేవరకద్ర నియోజకవర్గాల ప్రజలు కొన్ని మండలాలను వనపర్తి జిల్లాలో కాకుండా మహబూబ్‌నగర్ జిల్లాలో చేర్చాలంటున్నారు. వికారాబాద్ జిల్లాలో కాకుండా తమకు చేరువలో ఉన్న శంషాబాద్ జిల్లాలో చేర్చాలని మొయినాబాద్ మండల ప్రజలు కోరుతున్నారు. షాబాద్ గ్రామస్థులు తమను వికారాబాద్ జిల్లాలో కాకుండా శంషాబాద్ జిల్లాలో చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని తలకొండపల్లి, మాడుగుల, ఆమనగల్లు మండలాలను నాగర్‌కర్నూల్ జిల్లాలో కాకుండా శంషాబాద్ జిల్లాలో కలపాలని అఖిలపక్ష కమిటీ పట్టుబడుతోంది. అధికార పార్టీకి చెందిన నాయకులు, అఖిల పక్ష నేతలది కూడా ఒకటే డిమాండ్ కావడంతో వీటిని శంషాబాద్ జిల్లాలో చేర్చడానికి సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసి పంపించాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశించారు. దీంతో భీమా ప్రాజెక్టు స్పెషల్ కలెక్టర్ వనజారాణి స్వయంగా కల్వకుర్తి నియోజకవర్గంలోని మండలాలను సందర్శించి మార్పుచేర్పులకు సాధ్యాసాధ్యాలను పరిశీలించి వెళ్లారు. ఇప్పటికే మొయినాబాద్ మండలాన్ని శంషాబాద్ జిల్లాలో చేర్చాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వరంగల్ జిల్లా తొర్రూర్‌ను రెవిన్యూ డివిజన్ ఏర్పాటు చేసి దాంట్లో కొడకండ్ల మండలాన్ని కలపాలని అధికార పార్టీ నేతలు చేసిన డిమాండ్ మేరకు చేర్పులు, మార్పులకు ముఖ్యమంత్రి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు.