తెలంగాణ

డిజిటల్ తెలంగాణకు సిస్కో ఊతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 15: ఐటి దిగ్గజం సిస్కోతో తెలంగాణ ప్రభుత్వం గురువారం కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది. రాష్ట్రాన్ని డిజిటలైజ్ చేసే ప్రక్రియలో భాగంగా ఈ ఒప్పందాలు కుదిరాయి. మారుమూల ప్రాంతాలకు విద్యాబోధనను విస్తరింపజేయడం, స్థానిక ఆవిష్కరణలకు ఊతమివ్వడం, ఉపాధి అవకాశాలు పెంచడం, ఆర్థిక పోటీతత్వం పెంచడం, సిటిజన్ ఎంగేజ్‌మెంట్ వేగవంతం- ఈ అంశాలకు సంబంధించి సిస్కో, తెలంగాణ ప్రభుత్వాల మధ్య ఒప్పందాలు కుదిరాయి. ఈ ఒప్పందాల్లో భాగంగా హైదరాబాద్‌లో డిజిటల్ జోన్ స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఇన్నోవేషన్ హబ్, హైటెక్ సిటీ సమీపంలో లివింగ్ ల్యాబ్ ఏర్పాటు చేస్తారు. టి-హబ్ ప్రాంగణంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లివింగ్ ల్యాబ్ ఏర్పాటుతోపాటు కరీంనగర్‌లోని పది పాఠశాలల్లో రిమోట్ ఎడ్యుకేషన్ సౌకర్యం కల్పిస్తారు. అలాగే హైదరాబాద్‌లోని చారిత్రక కట్టడమైన కుతుబ్‌షాహీ టూంబ్స్ వద్ద డిజిటల్ పరిష్కారాలను అందుబాటులో ఉంచుతారు. హైటెక్ సిటీ వద్ద జరిగిన ఐటి సెక్టోరల్ పాలసీ ఆవిష్కరణ కార్యక్రమంలో ఈ ఒప్పందాలు కుదిరాయి. ఐటి మంత్రి కె తారక రామారావు, ప్రభుత్వ అధికారులు, సిస్కో ఇండియా అధ్యక్షుడు దినేష్ మల్కానీ ఒప్పందంపై సంతకాలు చేశారు.
హైటెక్ సిటీ వద్ద 2.2 కిలోమీటర్ల ప్రాంతంలో డిజిటల్ జోన్ ప్రాజెక్టును సిస్కో ఏర్పాటు చేస్తుంది. ఈ ప్రాజెక్ట్‌లో స్మార్ట్ వైఫై, స్మార్ట్ పార్కింగ్, స్మార్ట్ లైటెనింగ్ , కీలక జంక్షన్ల వద్ద ట్రాఫిక్ ఎనలిటిక్స్, ప్రభుత్వ సేవల కోసం రిమోట్ ఎక్స్‌పర్ట్, స్మార్ట్ ఎన్విరాన్‌మెంటల్ సెన్సార్స్, స్మార్ట్ వేస్ట్ మేనేజ్‌మెంట్, స్మార్ట్ కంట్రోల్ సెంటర్ ఉంటాయి.
టి-హబ్ ప్రాంగణంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, లివింగ్ ల్యాబ్‌ను ఏర్పాటు చేయడం వల్ల గ్లోబల్ స్మార్ట్ సిటీగా హైదరాబాద్ అభివృద్ధికి అవకాశం లభిస్తుంది. టి-హబ్‌లోని ఐఐఐటి క్యాంపస్‌లో 70వేల చదరపు అడుగుల భవంతిలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటవుతుంది. సిస్కో అమలు చేయనున్న ఇంటరాక్టివ్ ఎడ్యుకేషన్ ద్వారా తెలంగాణలో మారుమూల ప్రాంతాలకు సైతం నాణ్యమైన విద్య అందించడం సాధ్యం అవుతుంది. తొలుత కరీంనగర్ జిల్లాలోని పది పాఠశాల్లో పైలట్ ప్రాజెక్ట్‌గా అమలులోకి వస్తుంది.
ఈ ఒప్పందాల వల్ల తెలంగాణకు ఎంతో మేలు కలుగుతుందని మంత్రి కెటిఆర్ అభిప్రాయపడ్డారు. తెలంగాణను డిజిటల్ రాష్ట్రంగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. ఇనె్వస్టర్లు హైదరాబాద్ పట్ల ఆసక్తి చూపుతున్నారని అన్నారు. రాష్ట్రంలో ప్రతి పౌరుడు డిజిటల్ ప్రయోజనం పొందాలని, జీవన ప్రమాణాలు మెరుగు పడాలనేది ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. తెలంగాణ దేశానికి నాలెడ్జ్, టెక్నాలజీ హబ్‌గా మారుతోందని అన్నారు. కాగా డిజిటల్ రాష్ట్రంగా తెలంగాణను మార్చడంలో సహాయపడేందుకు సిద్ధంగా ఉన్నట్టు సిస్కో అధ్యక్షుడు దినేష్ మల్కాని తెలిపారు.

చిత్రం... హైటెక్ సిటీ వద్ద జరిగిన ఐటి సెక్టోరల్ పాలసీ ఆవిష్కరణ
కార్యక్రమంలో పాల్గొన్న ఐటి మంత్రి కెటిఆర్, ప్రభుత్వ అధికారులు, సిస్కో ఇండియా అధ్యక్షుడు దినేష్ మల్కానీ తదితరులు