తెలంగాణ

అంత సీన్ ఉందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తడి తక్కువ. తెరాస ఇచ్చిన హామీల బరువెక్కువ. గ్రేటర్ ఎన్నికల గోదాలో విజయం కోసం విశ్వనగర వ్యూహాత్మక ప్రణాళిక ప్రకటించినా, అది ఎంతవరకు సాధ్యమన్న సందేహాలు తలెత్తుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) ఎన్నికల సందర్భంగా అధికార పక్ష పార్టీ తెరాస ప్రకటించిన హామీల ఖరీదు
ఇంచుమించుగా 30 వేల కోట్లు. బల్దియా వార్షిక బడ్జెట్ కేవలం 5వేల కోట్లు. మరి, విశ్వనగరంగా
హైదరాబాద్‌ను తీర్చిదిద్దేందుకు తెరాస హామీల మొత్తం 30వేల కోట్లు ఎక్కడినుంచి తెస్తుందన్నదే బల్దియాపై
ముసురేస్తున్న సందేహాలు.

హైదరాబాద్, జనవరి 27: ఎన్నికల్లో గ్రేటర్ పీఠాన్ని తమకప్పగిస్తే హైదరాబాద్‌ను విశ్వనగరం చేసేందుకు ఇదీ మా ప్రణాళిక అంటూ ఇప్పటికే తెరాస ఎన్నికల మేనిఫేస్టోను ప్రకటించింది. తెరాస ప్రకటించిన ఎన్నికల హామీలన్నీ నెరవేర్చడానికి అవసరమయ్యే ఆర్థిక భారాన్ని భరించడం ఒక్క రాష్ట్ర ప్రభుత్వానికయ్యే పనికాదు. కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్‌కు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తే తప్ప, తెరాస హామీలు నెరవేరే పరిస్థితి లేదు. ఒకవేళ కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వకున్నా, రాష్ట్ర ప్రభుత్వం ఒక్కటే బల్దియాకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటే ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక పథకాలు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, నీటిపారుదల ప్రాజెక్టుల పథకాలు చతికిలపడాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతోంది. మరి అలాంటప్పుడు బల్దియాకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం ఏవిధంగా నెరవేర్చగలదంటే, అది మిలియన్ డాలర్ ప్రశే్న కానుంది. హైదరాబాద్‌ను విశ్వనగరం చేసేందుకు చైనాకు చెందిన కంపెనీలు భారీ మొత్తంలో అప్పు ఇవ్వడానికి ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే అప్పును మోయగలిగే శక్తి ప్రస్తుతం బల్దియాకు లేదన్నది కాదనలేని వాస్తవం. ఉన్న ఆర్థిక వనరులూ ఏవిధంగాను సరిపోయే పరిస్థితి లేదు. కేంద్రం ప్రకటించిన స్మార్ట్ సిటీస్ జాబితాలో హైదరాబాద్ నగరం ఉన్నప్పటికీ, ఈ పథకం ద్వారా పెద్దగా ఒరిగేదేమీ లేదు. ఏటా రూ.100 కోట్ల చొప్పున నాలుగేళ్లపాటు కేంద్రం నుంచి వచ్చే సొమ్ము కేవలం రూ.400 కోట్లు మాత్రమే. స్మార్ట్ సిటీస్ జాబితాలో చేర్చడం వల్ల హైదరాబాద్ నగరానికి
పెద్దగా ఒరిగేది ఉండదని, ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తే తప్ప విశ్వనగరంగా తీర్చిదిద్దలేమని రెండు నెలల కిందట కేంద్రానికి సిఎం కె చంద్రశేఖర్‌రావు రాసిన లేఖలోనే స్పష్టం చేసిన విషయం ఇక్కడ గమనార్హం. ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీమేరకు హైదరాబాద్ నగరంలో ఒక్క ట్రాఫిక్ సమస్యను అధిగమించడానికే రూ.20 వేల కోట్ల ఖర్చవుతుందని ఎన్నికల ప్రణాళికలో తెరాసే పేర్కొంది. గ్రేటర్ పరిధిలో తాగునీటి సరఫరా కోసం ఇప్పటికే గోదావరి మొదటి దశ, కృష్ణా మూడవ దశ పనుల కోసం రూ.5000 కోట్లు ఖర్చు చేస్తుంది. వీటికోసం బల్దియా చేసిన అప్పులు తీర్చడమే బల్దియాకు పెనుభారంగా మారింది. మరి అలాంటప్పుడు హైదరాబాద్ నగరంలో స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్లాన్ (ఎస్‌ఆర్‌డిపి) కోసం అవసరమయ్యే రూ.20 వేల కోట్ల అప్పును ఏవిధంగా భరించే శక్తి ఉంది. ప్రస్తుతం దీనికున్న ఆర్థిక వనరులు రీత్యా ఇంత పెద్ద మొత్తం అప్పును మోయగల శక్తి ఎక్కడి నుంచి వస్తుందన్నది ఎన్నికల ప్రణాళికలో తెరాస స్పష్టం చేయలేకపోయింది. ఎన్నికల ప్రణాళికలో తెరాస ఇచ్చిన హామీలకు అయ్యే వ్యయాన్ని లెక్కకడితే... నగరానికి తాగునీటిని సరఫరా కోసం గోదావరి మొదటి దశ, కృష్ణా మూడవ దశకు కలిపి రూ.5000 కోట్లు ఖర్చు చేస్తుంది. దీనికితోడు తాగునీటి సరఫరా పైపులైన్లను 280 కిలోమీటర్ల పొడవున విస్తరణకు మరో రూ.1900 కోట్లు ఖర్చవుతుంది. అలాగే నగరానికి అవసరమయ్యే విద్యుత్ కోసం ప్రత్యేకంగా 420 కెవి గ్రిడ్ ఏర్పాటుకు రూ.1920 కోట్లు, నగరం మీదుగా వెళ్లే ఆర్ అండ్ బి రోడ్ల కోసం రూ.337 కోట్లు మొత్తంగా రూ.29వేల 157 కోట్లు ఖర్చువుతుందని ఎన్నికల ప్రణాళికలో తెరాస అంచనా వేసింది.
బల్దియా ఎన్నికల్లో అధికార పార్టీ ఇచ్చిన హామీలు అమలైతే విశ్వనగరం హైదరాబాద్ తెలంగాణ సిగలో కలికితురాయే అవుతుంది. విశ్వనగర ప్రయోగం వికటిస్తే మాత్రం, తెలంగాణకు హైదరాబాద్ గుదిబండగా మారే ప్రమాదం ఉంది.