ఆంధ్రప్రదేశ్‌

‘భూబాగోతం కరణం’ ఇకలేరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెరవలి, సెప్టెంబర్ 16: కరణం పాత్రనే తన పేరుగా ఖ్యాతిగాంచిన ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి ‘్భబాగోతం’ నృత్య నాటికలోని కరణం పాత్రధారి ముత్యాల వెంకటేశ్వరరావు(66) శుక్రవారం మృతిచెందారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. పశ్చిమగోదావరి జిల్లా పెరవలి మండలం అన్నవరప్పాడుకు చెందిన వెంకటేశ్వరరావు గత కొద్దికాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజా నాట్యమండలి అధ్వర్యంలో రాష్టవ్య్రాప్తంగా మూడు దశాబ్దాలుగా విశేష అదరణ పొందిన భూబాగోతం నృత్యనాటికలో కరణం పాత్రను వెంకటేశ్వరరావు పోషించారు. అప్పటినుండి ఆయనను కరణంగా పిలుస్తుంటారు. గతంలోగ్రామాల్లోని కరణం, మునసబుల వ్యవస్థలో సన్న చిన్నకారు రైతుల భూ సమస్యలకు అద్దం పట్టిన భూబాగోతం నృత్యనాటిక రాష్టవ్య్రాప్తంగా పేరుగాంచింది. ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలికి చెందిన పది బృందాలు రాష్టవ్య్రాప్తంగా ఈ నాటికను ప్రదర్శించాయి. వాటిలో అన్నవరప్పాడు బృందం ప్రథమ స్థానంలో నిలిచింది. అన్నవరప్పాడు బృందంలో కరణం పాత్రను పోషించిన ముత్యాల వేంకటేశ్వరరావు నటన అందరినీ అకట్టుకునేది. రాష్టవ్య్రాప్తంగా రెండువేల ప్రదర్శనలు ఇచ్చిన ఈ బృందం పలు ప్రసంశలు అందుకుంది. వెంకటేశ్వరరావు మృతిపట్ల మాజీ ఎమ్మెల్యే వంక సత్యనారాయణ, ఎఐఎస్‌ఎఫ్ రాష్ట్ర కమిటీ సభ్యులు బుద్దాల నాగేశ్వరరావు, మాజీ సర్పంచ్ డివిఎన్ హనుమంతరావు, అబ్బులరాజు, రామకృష్ణ, రంగినీడి ఆదినారాయణ, సొసైటీ మాజీ అధ్యక్షులు పంతం నాగేశ్వరరావు, సైపురెడ్డి బాబ్జి తదితరులు సంతాపం తెలిపారు.
22న మంత్రివర్గ సమావేశం
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, సెప్టెంబర్ 16: రాష్ట్ర కేబినెట్ సమావేశం ఈ నెల 22న విజయవాడలో జరగనుంది. రాష్ట్రంలో వరదలు, పంట నష్టంపై ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించనున్నారు. అలాగే రిజర్వాయర్లకు నీటి విడుదలపై కూడా చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా కృష్ణా జల వివాదంపై కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతితో చర్చించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లనున్నారు. ఇదిలా ఉండగా ఈ నెల 27, 28 తేదీల్లో కలెక్టర్ల సదస్సు విజయవాడలో నిర్వహించనున్నారు. పంట రుణాల విషయంలో బ్యాంకర్ల, రైతులకు మధ్య సమన్వయం కుదర్చడం, రెండంకెల వృద్ధిరేటు తదితర అంశాలను చర్చించనున్నారు. 29 జిల్లా ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో సిఎం భేటీ అవనున్నారు.
22న హోదాపై జగన్ యువభేరి
ఆంధ్రభూమి బ్యూరో
ఏలూరు, సెప్టెంబర్ 16 : రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండుతో వివిధ ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలో ‘యువభేరి’ కార్యక్రమం నిర్వహించనుంది. జిల్లా కేంద్రం ఏలూరులో ఈనెల 22న విద్యార్థినీ విద్యార్థులతో యువభేరి నిర్వహిస్తారు. ఈకార్యక్రమంలో పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి పాల్గొంటారు. ఏలూరులోని శ్రీ కనె్వన్షన్ సెంటర్‌లో నిర్వహించే యువభేరిలో జగన్మోహన్‌రెడ్డి విద్యార్థినీ విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహిస్తారని ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోసు, వైసిపి ప.గో. జిల్లా అధ్యక్షుడు ఆళ్లనాని తెలిపారు. ఇందులో మేధావులు కూడా పాల్గొనవచ్చునని వివరించారు.

ప్యాకేజిని తక్కువచేసి
మాట్లాడడం సబబు కాదు
పరకాల ప్రభాకర్ హితవు
తిరుమల, సెప్టెంబర్ 16: కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అందించిన ప్రత్యేక ప్యాకేజిపై వాస్తవాలు తెలుసుకోకుండా తక్కువ చేసి మాట్లాడటం సబబు కాదని రాష్ట్ర మీడియా సలహదారులు పరకాల ప్రభాకర్ అభిప్రాయపడ్డారు. నూతన రాష్ట్ర నిర్మాణంలో మీడియా పాత్ర అనే అంశంపై తిరుపతిలో జరిగిన సదస్సులో పాల్గొనడానికి వచ్చిన ఆయన శుక్రవారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్యాకేజిని తక్కువగా చూడాల్సిన అవసరం లేదన్నారు. ప్రత్యేక ప్యాకేజి వల్ల కలిగే ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని అటు తరువాత ఎవరైనా విమర్శించవచ్చన్నారు. పోలవరం ప్రాజెక్టు వ్యయాన్ని వందశాతం కేంద్రమే పూర్తిగా భరిస్తుందన్నారు. వివిధ ప్రాజెక్టులకు 30 శాతం నిధులు అందించడం, లోటు బడ్జెట్‌కు కూడా కేంద్రం నిధులు అందిస్తామని కేంద్రం ప్రకటించడం రాష్ట్భ్రావృద్ధికి ఎంతో కీలకమన్నారు.పోలవరంలో త్వరిగతిన పూర్తిచేసి సాగునీరు, విద్యుత్ ఉత్పత్తులతో రాష్ట్రాన్ని ముందుకు నడిపేందుకు సిఎం ప్రత్యేక దృష్టి సారిస్తున్నారన్నారు.

మహిళా నక్సలైట్ ఎన్‌కౌంటర్
సీలేరు, సెప్టెంబర్ 16: మావోయిస్టులకు, పోలీసులకు జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మహిళా మావోయిస్టు మృతి చెందింది. కాల్పుల్లో మరికొంత మంది మావోయిస్టులకు తీవ్ర గాయాలైన సంఘటన ఒడిశా రాష్ట్రం కలహండి జిల్లాలో శుక్రవారం జరిగింది. దీనిపై ఒడిశా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కలహండి జిల్లాలోని పీజాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి కండ్లంగు అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సమావేశమయ్యారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ పోలీసులు పీజాపూర్ అటవీ ప్రాంతంలో కూబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు తారసపడ్డారు. పోలీసుల రాకను గమనించిన మావోలు పోలీసులపై కాల్పులకు పాల్పడ్డారు. దీంతో ఆత్మరక్షణలో భాగంగా పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ఇరువర్గాల మధ్య గంట పాటు హోరాహోరీగా కాల్పులు జరిగినట్లు తెలిపారు.

కబ్జా భూముల స్వాధీనానికి చర్యలు
అయినవిల్లి, సెప్టెంబర్ 16: కబ్జాకు గురైన దేవాలయాల ఆస్తుల స్వాధీనానికి చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అన్నారు. ఇలా కబ్జాకు గురైన ఆలయాల భూములు సుమారు రెండు లక్షల ఎకరాలు గుర్తించామన్నారు. తూర్పు గోదావరి జిల్లా అయినవిల్లిలో శుక్రవారం మంత్రి విలేఖర్లతో మాట్లాడారు. ఆలయాల ఆస్తుల లీజులను బహిరంగ వేలం ద్వారా నిర్వహిస్తామని ప్రకటించారు. దీనివల్ల ఆలయాలకు ఆదాయం పెరుగుతుందన్నారు. ఆలయాల్లో పనిచేసే తాత్కాలిక ఉద్యోగులు అర్చకులకు ట్రెజరీ ద్వారా జీతాలు చెల్లించడానికి అన్ని ఏర్పాట్లు చేశామని మంత్రి తెలిపారు. మండల ప్రధాన కేంద్రంలోని దేవాలయాల్లో పనిచేసే అర్చకులు, ఉద్యోగులకు రూ.10వేలు, గ్రామాల్లోని దేవాలయాల్లో పనిచేసేవారికి రూ.5000 చెల్లించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చర్యలు తీసుకున్నారని మంత్రి వివరించారు.

పెరుగుతున్న
గోదావరి వరద
ఆంధ్రభూమి బ్యూరో
రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 16: ధవళేశ్వరం వద్ద గోదావరి వరద ఉద్ధృతి పెరుగుతోంది. భద్రాచలం వద్ద కాస్తంత ఉద్ధృతి తగ్గినప్పటికీ, ధవళేశ్వరం వద్ద మాత్రం కొనసాగుతోంది. భద్రాచలం వద్ద శుక్రవారం 30.1 అడుగుల నీటిమట్టం కొనసాగుతోంది. ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజి వద్ద 10 అడుగులకు పెరిగింది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ నుంచి 4 లక్షల 31 వేల 992 క్యూసెక్కుల వరద జలాలను సముద్రంలోకి విడుదల చేశారు. ధవళేశ్వరం, విజ్జేశ్వరం ఆర్మ్‌లలో ఒక మీటర్, ర్యాలీ, మద్దూరు ఆర్మ్‌లలో 1.5 మీటర్ల మేర గేట్లు ఎత్తివేసి వరద జలాలను సముద్రంలోకి విడిచిపెడుతున్నారు.

మద్యం కోసం కొడుకు అమ్మకం
ఆంధ్రభూమి బ్యూరో
నెల్లూరు, సెప్టెంబర్ 16: మద్యానికి బానిసైన ఓ తల్లి వెయ్యి రూపాయల నగదు కోసం కన్నకొడుకునే అమ్మివేసిన సంఘటన నెల్లూరు రూరల్ మండలపరిధిలోని బుజబుజనెల్లూరు సమీపంలో చోటుచేసుకుంది. శుక్రవారం ఈ విషయం వెలుగులోకి వచ్చింది. స్థానికుల కథనం మేరకు వివరాలు. చెముడుగుంట పంచాయతీ పరిధిలోని మస్తాన్‌కు సుమారు ఐదేళ్ల క్రితం మధు అనే మహిళతో వివాహమైంది. కొద్దిరోజులపాటు వీరి సంసారం కొంతకాలం సాగగా, వీరికి ఓ కుమారుడు జన్మించాడు. గత కొద్దిరోజుల క్రితం భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో వారిరువురు విడివిడిగా ఉంటున్నారు. దీంతో భార్య మధు మద్యం అలవాటుకు లోనైంది. గత కొద్దిరోజులుగా మద్యం సేవించడానికి నగదు లేకపోవడంతో ఆమె కుమారుడిని అమ్మకానికి పెట్టింది. మద్యం మత్తులో బుజబుజనెల్లూరుకు చెందిన రమణమ్మకు సుమారు వెయ్యి రూపాయలకు తన నాలుగు సంవత్సరాల కుమారుడిని అమ్మివేసింది.