తెలంగాణ

రహదారులా... ‘జల’దారులా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 16: వరుణుడి ప్రతాపానికి మహానగరం విలవిలలాడింది... వాన తాకిడికి వణికింది... ఒక్కముక్కలో చెప్పాలంటే నిలువునా మునిగింది... రహదారులన్నీ చెరువులను తలపించాయ. రాజధాని నగరాన్ని రెండు గంటలపాటు వరుణుడు తన గుప్పిట్లో బంధించాడనడంలో అతిశయోక్తి లేదేమో. ఆ స్థాయలో వర్షబీభత్సం నగర వాసుల్ని గడగడ లాడించింది. జనజీవనం ఒక్కసారిగా స్తంభించింది. నిరంతరం రద్దీగా ఉండే ప్రాంతాల్లో కార్లు, ఇతర వాహనాలు నీటిలో పడవల్లా తేలియాడాయ. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట వంటి ప్రాంతాలు చెరువులను తలపించాయి. ఆఫీసుల నుంచి తిరుగుముఖం పట్టే వేళ కావడంతో నగరవాసికి నరకమే ఎదురైంది. వాహనాలు నీటిలో చిక్కుకుపోయాయి. నెక్లెస్ రోడ్, ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ వద్ద నీళ్లలో దాదాపు కార్లు మునిగిపోయిన పరిస్థితి కనిపించింది. ‘మీ ప్రయాణాన్ని వాయిదా వేసుకోండి, ట్రాఫిక్ క్లియర్ కావడానికి రెండు గంటలు పడుతుంది’ అని స్వయంగా ట్రాఫిక్ పోలీసులు ప్రకటనలు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. మెట్రో పనులతో రోడ్లు ఇరుకుగా మారిపోయాయి. దానికి తోడు భారీ వర్షం, రోడ్లకు గుంతలు పడడంతో ట్రాఫిక్ జామ్‌లతో నగరంలో ప్రయాణం నరక ప్రాయంగా అనిపించింది. శుక్రవారం మూడు గంటల నుంచి నగరంలోని వివిధ ప్రాంతాల్లో వర్షం ప్రారంభం అయింది. వివిధ ప్రాంతాల్లో రెండు మూడు గంటల పాటు భారీ వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, సోమాజిగూడ, మాదాపూర్, కూకట్‌పల్లి, నిజాంపేట, నారాయణగూడ, కోఠి, అల్వాల్, లోతు కుంట, తిరుమల గిరి తదితర ప్రాంతాల్లో భారీ వర్షం వల్ల కూడలి వద్ద భారీగా నీరు నిలిచింది.
బేగంపేట లోని సిఎం క్యాంపు కార్యాలయం, రాజ్‌భవన్ ప్రాంతాలు లోతట్టులో ఉండడంతో వర్షపు నీరు నిలిచిపోయి, వాహనాలు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. భారీ వర్షానికి బంజారాహిల్స్‌లో ధోబీ ఘాట్ కూలింది. ముందు జాగ్రత్త చర్యగా జూను శుక్రవారం మూసి వేశారు. భారీ వర్షాల వల్ల నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. రెండు గంటల పాటు కురిసిన వర్షం వల్ల ట్రాఫిక్ స్తంభించిపోయింది. దాదాపు మూడు గంటల అనంతరం ట్రాఫిక్ సాధారణ స్థితికి వచ్చింది. తెలుగుతల్లి, మసాబ్ ట్యాంక్ ఫ్లైఓవర్, పివి ఎక్స్‌ప్రెస్ వే వద్ద ట్రాఫిక్ గంటల తరబడి నిలిచిపోయింది. పివి ఎక్స్‌ప్రెస్ పై నాలుగు కార్లు ఢీ కొని నలుగురు గాయపడ్డారు.
జిహెచ్‌ఎంసి కమీషనర్ పరిస్థితిని సమీక్షిస్తూ నీరు నిలువ ఉండకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. టాఫిక్ పోలీసులంతా ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చేయాలని నగర పోలీసు కమీషనర్ పోలీసులను ఆదేశించారు.