తెలంగాణ

యూనివర్శిటీలో ప్రొఫెసర్లపై నిఘా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 27: విశ్వవిద్యాలయాల్లో వివిధ అంశాలపై పలురూపాల్లో ఉద్యమాలు జరుగుతున్న నేపథ్యంలో బోధన, బోధనేతర సిబ్బంది పాత్రపై కేంద్రం ఆరా తీస్తోంది. దాదాపు అన్ని విశ్వవిద్యాలయాల్లో నిరంతరం విద్యార్ధి ఉద్యమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. అయితే కొన్ని విశ్వవిద్యాలయాల్లో ప్రత్యేక అంశాలపై కూడా ఉద్యమాలు జరుగుతున్నాయి. ప్రధానంగా సమకాలీన అంతర్జాతీయ, జాతీయ సంఘటనలపైనా, మతపరమైన , కులపరమైన అంశాలపైనా, ప్రత్యేక వర్గాలు గ్రూపులు తమ వాదనలను వినిపించుకునేందుకు విశ్వవిద్యాలయాలను వేదికగా మార్చుకుంటున్నాయి. అయితే విద్యార్ధి సంఘాలకు కొంత మంది ప్రొఫెసర్లు మద్దతు పలకడం, వారి వెన్నంటే ఉండి ఉద్యమాలు జరిపించడం బహిరంగ రహస్యం, ఇటీవల కొన్ని విశ్వవిద్యాలయాల్లో ప్రత్యక్షంగా ముందుండి మరీ బోధన సిబ్బంది ఉద్యమాలను నిర్వహించారు. ఈ క్రమంలో దేశంలో ప్రధానంగా కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ఉద్యమాలపై ప్రభుత్వం ఇప్పటికే నిఘా విభాగం నివేదికలను తెప్పించుకుంది. ఉద్యమాల వెంట ఉన్న ప్రొఫెసర్లు, ఇతర సిబ్బంది పేర్లను సేకరించింది. బోధన సిబ్బంది కార్యకలాపాలు, బోధన పనితీరు, వివిధ సంస్థలతో వారికి ఉన్న అనుబంధం, బహిరంగ వేదికలపై వారి ఉపన్యాసాలు, ప్రభుత్వానికి, పాలకులకు వ్యతిరేకంగా చేస్తున్న ప్రకటనలపై నివేదికలను తెప్పించుకుంది. ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, ప్రొఫెసర్ డి సౌమ్య, తథాసేన్ గుప్త, కెవై రత్నం, ప్రొఫెసర్ హరిబాబు, ప్రొఫెసర్ హరగోపాల్, అపర్ణ వంటి వారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో బహిరంగంగా వివిధ ఉద్యమాలకు ఊతంగా నిలిచారనేది ఈ నివేదిక సారాంశం. అయితే వీరిపై ఎలాంటి చర్యలను తీసుకోవాలో, ఎలా తీసుకోవాలనేదానిపై కేంద్ర న్యాయసలహాలు కూడా తీసుకుంటోంది. అనంతరం వీరందరికీ నోటీసులు జారీ చేయాలని చూస్తోంది. రోహిత్ కులం ఎస్సీ కాదని స్వయంగా ఆయన తండ్రి ఎలక్ట్రానిక్ మీడియా ముందు స్పష్టం చేయడంతో రోహిత్ ఆత్మహత్య వ్యవహారం మలుపుతిరిగింది. స్వయంగా తండ్రి ఎలక్ట్రానిక్ మీడియా ముందుకు వచ్చి ప్రకటన చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

విహెచ్ వౌనదీక్ష

రోహిత్ మృతిపై ఆందోళన తరలివచ్చిన విద్యార్థులు
పోలీసులతో వాగ్వాదం ట్యాంక్‌బండ్‌వద్ద ఉద్రిక్తత

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 27: కేంద్రీయ విశ్వవిద్యాలయం రీసెర్చ్ స్కాలర్ రోహిత్ ఆత్మహత్యకు కారకులైన వారిపై తగు చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బుధవారం టాంక్‌బండ్ సమీపంలో అంబేద్కర్ విగ్రహం వద్ద రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు వౌనదీక్ష చేపట్టారు. నోటికి గుడ్డకట్టుకుని ఆయన దీక్ష చేశారు. ఆయనకు మద్దతుగా ఎన్‌ఎస్‌యుఐ విద్యార్థులు తరలివచ్చారు. దీక్షాశిబిరం వద్ద పోలీసులు, విద్యార్థులకు వాగ్వాదం జరిగింది. దీంతో కాస్సేపు స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. దీక్ష ప్రారంభించడానికి ముందు విహెచ్ మీడియాతో మాట్లాడారు. రోహిత్ మృతిపై న్యాయ విచారణ జరిపించాలని దేశవ్యాప్తంగా నిరశనలు కొనసాగుతున్నప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకపోవడం విచారకరమన్నారు. న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీపైనే నిందలు మోపుతున్నారని ఎంపి హనుమంతరావు ఆరోపించారు. దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ఏఐసిసి ఉపాధ్యక్షు రాహుల్ గాంధీ, త్రిపుర సిఎం, అంబేద్కర్ మనువడు, సీతారాం ఏచూరి, సురవరం సుధాకర్ రెడ్డి వంటి జాతీయ నాయకులు సెంట్రల్ వర్శిటీని సందర్శించి విద్యార్థుల దీక్షకు సంఘీభావం ప్రకటిస్తే, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌కు సమయం దొరకడం లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ప్రముఖ యూనివర్శిటీగా వెలుగొందుతున్న హెచ్‌సియులో ప్రారంభమైన ఆందోళన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తుంటే కెసిఆర్ పట్టించుకోకపోవడం దురదృష్టకరమన్నారు. రోహిత్ ఆత్మహత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని, హెచ్‌సియూ విసిని సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

బుధవారం ట్యాంక్‌బండ్ వద్ద
అంబేద్కర్ విగ్రహం ఎదుట
వౌనదీక్ష చేస్తున్న ఎంపి విహెచ్

విశ్వవిద్యాలయాల బంద్ ప్రశాంతం

ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్‌లలో ర్యాలీలు విసి సస్పెన్షన్‌కు డిమాండ్ నేటినుంచి దళిత అధ్యాపకుల ఆమరణ దీక్ష

హైదరాబాద్/న్యూఢిల్లీ, జనవరి 27: రీసెర్చ్ స్కాలర్ రోహిత్ ఆత్మహత్యకు కారకులైన వారిని శిక్షించాలని కోరుతూ హెచ్‌సియూ విద్యార్థి జెఏసి ఇచ్చిన దేశవ్యాప్త బంద్ పిలుపు మేరకు బుధవారం దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాల బంద్ ప్రశాంతంగా జరిగింది. విద్యార్థి రోహిత్ ఆత్మహత్యపై విచారణలో జాప్యాన్ని నిరసిస్తూ విద్యార్థులు తరగతులను బహిష్కరించారు. హైదరాబాద్ వర్శిటీలో విసి అప్పారావును బర్తరఫ్ చేయాలని దళిత విద్యార్థి సంఘం ఆందోళన చేపట్టిన విషయం విదితమే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు యూనివర్సిటీలతోపాటు ఢిల్లీ, చెన్నైలలోని కేంద్రీయ విశ్వవిద్యాలయాలు బంద్ పాటించాయి. విద్యార్థులు నిరశన ప్రదర్శనలు నిర్వహించారు. చెన్నై రాజ్‌భవన్‌ను ముట్టడించేందుకు యత్నించిన 40 మంది విద్యార్థులను, దిల్లీలో శాస్ర్తీభవన్ వద్ద 60 మంది ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు.
అదేవిధంగా ఉస్మానియా యూనివర్శిటీలో బంద్ ప్రశాంతంగా జరిగింది. విద్యార్థి రోహిత్ ఆత్మహత్యను కొందరు రాజకీయం చేస్తున్నారని ఆరోపిస్తూ ఏఐఎస్‌ఎఫ్ విద్యార్థులు యూనివర్శిటీలో తరగతులు బహిష్కరించి నిరశన తెలిపారు. ఉస్మానియా యూనివర్శిటీలో విద్యార్థులు ఆర్ట్స్ కళాశాల నుంచి ఎసిసి గేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. వారిని అడ్డుకునేందుకు యత్నించగా పోలీసులు, విద్యార్థుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో పోలీసులు పలువురు విద్యార్థులను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి జెఎసి నాయకుడు బి స్టాలిన్ మాట్లాడుతూ విశ్వవిద్యాలయాలు స్వయం ప్రతిపత్తిని కోల్పోయి రాజకీయ నాయకుల కనుసన్నల్లో నడుస్తున్నాయని ఆరోపించారు.
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం హిందూత్వ ఏజెండాతో ఆర్‌ఎస్‌ఎస్ భావాలు కలిగిన వారిని విసిలుగా నియమించి కులవివక్షను పెంచిపోషిస్తోందని విమర్శించారు. విద్యార్థుల మధ్య చిచ్చుపెట్టే ఏ ప్రభుత్వమైనా ఎక్కువ కాలం మనలేదన్నారు. కులవివక్ష కారణంగా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడకుండా చూడాలని, హెచ్‌సియూలో శాంతి నెలకొల్పి రోహిత్ కుటుంబానికి న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

హైదరాబాద్‌లోని సెంట్రల్ వర్శిటీ గేటు బయట నినాదాలు చేస్తున్న విద్యార్థులు