తెలంగాణ

బిజెపి బహిరంగ సభలో సీనియర్లకు అవమానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, సెప్టెంబర్ 18: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత మొదటి సారిగా బిజెపి వరంగల్‌లో నిర్వహించిన బహిరంగసభ ద్వారా సత్తా చాటింది. విమోచన ఉత్సవాల సందర్భంగా ఏకంగా పార్టీ జాతీ య అధ్యక్షుడు అమిత్‌షానే ఆహ్వానించి పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన సభ విజయవంతం చేసి పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజం నింపింది. అయినప్పటికీ పార్టీ సీనియర్ నాయకులకు మాత్రం బహిరంగసభలో అవమానం జరిగింది. గత ఏడాది కిందట వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్ట్భద్రుల స్ధానం నుండి పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందిన పార్టీ సీనియర్ నేత కల్లెడ రాంమోహన్‌రావు, వరంగల్ పార్లమెంట్ ఉపఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయి, పార్టీకోసం ఆర్ధికంగా తోడ్పడుతున్న ఎన్‌ఆర్‌ఐ పగిడిపాటి దేవయ్య ఈయన కేవలం అమిత్‌షా బహిరంగసభ కోసమే ప్రత్యేకంగా అమెరికా నుండి వచ్చాడు. అంతే కాకుండా మాజీ ఎమ్మెల్యేలు మందాడి సత్యనారాయణరెడ్డి , కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి వీరు కూడా స్వంత ఖర్చులతోనే బహిరంగంసభ విజయవంతం కోసం కృషిచేసారు. ఇలాంటి వీరికి వరంగల్ బహిరంగసభ వేదికపైకి ఆహ్వనించే అవకాశం దక్కలేదు. దీంతో తీవ్ర మనస్ధాపం చెందిన ఆనలుగురు ముఖ్యనాయకులు బహిరంగసభ నుండి అలిగివెళ్లిపోయారు. పైగా ఈనలుగురు ముఖ్యనేతలు కూడా. బహిరంగ సభ సందర్భంగా వారు స్వంతఖర్చులతో ప్రచార రథాలను, హోల్డింగ్‌లను ఏర్పాటు చేయగా, మరొకరు వారి నియోజకవర్గం నుండి జనాన్ని తరలించారు. మరో నేత బహిరంగసభ సందర్భంగా కవితలు, ప్రసంగాలు రచించారు. కాగా ఈవిషయంపై పార్టీ ముఖ్యనేత ఒకరు వివరణ ఇస్తూ.. కేవలం కేంద్ర పార్టీ నుండి వచ్చిన జాబితా ఆదారంగానే వేదికపైకి ఎవరెవరిని పిలువాల్సివచ్చిందో వారినే పిలువడం జరిగిందని, ఈవిషయంలో సీనియర్లకు అవమానం జరిగిన విషయాన్ని ఆయన అంగీకరించారు. అయినప్పటికీ విషయాన్ని గ్రహించి వారిని వేదికపైకి పిలిచేలోపే ఆ నాయకులు అక్కడి నుండి వెళ్లిపోయారని తెలిపారు.