తెలంగాణ

తగవు తీరాలి... నీళ్ళు పారాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 18:రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలు పరిష్కారం కావాలని ప్రధానమంత్రి కోరుకుంటున్నారని, ఈనెల 21న జరిగే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో సమస్య పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నట్టు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. తెలంగాణలో ప్రాజెక్టులపై నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావుతో ఆయన ఆదివారం సమావేశమయ్యారు. రెండు రాష్ట్రాలు వివాదాలు పరిష్కరించుకుని సకాలంలో ప్రాజెక్టులను పూర్తి చేసుకోవాలని, లేక పోతే ప్రాజెక్టుల వ్యయ భారం పెరిగిపోతుందని దత్తాత్రేయ అభిప్రాయపడ్డారు. తెలంగాణ వెనుకబడిన ప్రాంతమని ప్రాజెక్టుల ద్వారా సాగు అవుతున్న భూమి చాలా తక్కువ అని , తెలంగాణకు న్యాయం జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు. త్వరలోనే తెలంగాణ బిజెపి నాయకులు ప్రధానమంత్రిని కలిసి కాళేశ్వరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని కోరనున్నట్టు చెప్పారు.