తెలంగాణ

గుడిపల్లి రిజర్వాయర్‌లో పడి ఇద్దరు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగర్‌కర్నూల్, సెప్టెంబర్ 18: ఇటీవలే ప్రారంభమైన కెఎల్‌ఐ మూడో లిఫ్టు ద్వారా గుడిపల్లి రిజర్వాయర్‌లోకి వచ్చిన నీటిని చూసేందుకు వెళ్లి ప్రమా దవశాత్తు పడి ఇద్దరు మృతి చెందిన విషాద సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. మృతువుని బంధువులు తెలిపిన వివరాల ప్రకారం. మహబూబ్‌నగర్ జిల్లాలోని కెఎల్‌ఐ మూడో లిప్టు ద్వారా నీటిని పంపింగ్ చేసి పక్కనే ఉన్న గుడిపల్లి రిజర్వాయర్‌ను నింపుతున్నారు. దీనిని చూసేందుకు నాగర్‌కర్నూల్‌కు చెందిన మహమూద్ భార్య ఆసియా బేగం తన పిల్లలతోపాటు హైదరాబాద్ నుంచి వచ్చిన బంధువైన మహమ్మద్ షానవాస్ (20)తో కలిసి గుడిపల్లి మూడోలిప్టు, రిజర్వాయర్ వద్దకు వెళ్లారు. రిజర్వాయర్ ఆనకట్టకు ఎడమవైపున ఉన్న గట్టువద్దకు వెళ్లి శీతాఫలాలను తెంపుకొని పక్కనే ఉన్న రిజర్వాయర్‌లోకి దిగారు. అక్కడ ప్రమాదవశాత్తు ముగ్గురు పిల్లలు జారిపడిపోగా వారిలో మునీర్, మజ్జులను తల్లి ఆసియాబేగం రక్షించగా, మరో అమ్మాయితోపాటు మహ్మద్ షానవాస్‌లు నీటిలో మునిగి చనిపోయారు. రిజర్వాయర్‌ను చూసేందుకు వచ్చిన వారు దీనిని గమనించి వెంటనే నాగర్‌కర్నూల్‌లో ఉన్న బంధువులకు సమాచారం అందించారు. కౌన్సిలర్ ఖాజాఖాన్, టిఆర్‌ఎస్ నాయకులు భాస్కర్‌గౌడ్ తదితరులు ఎస్సై ప్రదీప్‌కు, అగ్నిమాపక దళ ఎస్సై వేణుకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి వెళ్లి జలాశయంలో గల్లంతైన వారిని వెతికి ఫారయా (9), మహ్మద్ షానవాస్ (20)ల మృతదేహాలను వెలికితీశారు.