తెలంగాణ

బార్ లైసెన్స్ గడువు మళ్లీ పొడిగింపు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 18: బార్ అండ్ రెస్టారెంట్ల లైసెన్స్‌ల గడువును మరోసారి పొడిగించాలని ప్రభుత్వం యోచిస్తోన్నట్టు తెలిసింది. ఈ నెలాఖరుతో గతంలో జారీ చేసిన బార్ లైసెన్స్‌లకు గడువు తీరిపోనుంది. అక్టోబర్ ఒకటి నుంచి కొత్త బార్ లైసెన్స్‌లు జారీ చేయాల్సి ఉంది. అయితే కొత్త జిల్లాల ఏర్పాటులో అధికారులు తలమునకలు కావడంతో మరోసారి బార్ లైసెన్స్‌ల వ్యవధిని పెంచాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు అధికార వర్గాల సమాచారం. వీటికి గతంలో 2015-16 కాలపరిమితితో జారీ చేసిన లైసెన్స్‌లకు 2016 జూన్ నెలాఖరుతో గడువు ముగియగా జూలై ఒకటి నుంచి కొత్త లైసెన్స్‌లు జారీ చేయాల్సి ఉంది. అయితే వీటి కాలపరిమితిని మూడు నెలల పాటు పొడిగించింది. దీంతో సెప్టెంబర్ నెలాఖరుకు గతంలో పొడిగించిన గడువు కూడా తీరిపోయింది. అక్టోబర్ ఒకటి నుంచి కొత్త లైసెన్స్‌లు జారీ చేయాల్సి ఉండగా, కొత్త జిల్లాల ఏర్పాట్ల కారణంగా మరో మూడు నెలలు డిసెంబర్ వరకు పొడిగించే అవకాశం ఉందని అధికార వర్గాల సమాచారం.