తెలంగాణ

ఎసిబి వలలో నీటిపారుదల ఎఇ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, డిసెంబర్ 1: వరంగల్ నీటిపారుదల శాఖ కార్యాలయంలో అసిస్టెం ట్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ఎ.సురేందర్ రావు 50 వేల రూపాయలు లంచం తీసుకొంటూ మంగళవారం ఎసిబి అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపో యారు.
హన్మకొండ సబ్‌డివిజన్‌లో ఏఈగా పని చేస్తున్న ఈయన భద్రకాళి చెరువు పనుల రీడిజైనింగ్ ప్రతిపాదనల కోసం సబ్ కాంట్రాక్టర్ ప్రకాష్‌రెడ్డిని 50వేలు లంచం అడుగగా.. సబ్ కాంట్రాక్టర్ నేరు గా ఎసిబి అధికారులను సంప్రదించారు. దీంతో ఎసిబి డిఎస్పీ సాయిబాబా పథకం ప్రకారం.. రూ. 50 వేలు కాంట్రాక్టర్‌కు ఇచ్చి పంపించాడు. కాంట్రాక్టర్ వద్ద ఎఇ డబ్బులు తీసుకుంటున్న క్రమంలో ఎసిబి అధికారులు రంగ ప్రవేశం చేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నగదును స్వాధీనం చేసుకొని కార్యాలయంలో రికార్డులన్నింటినీ పరిశీలించారు. అదే విధంగా హన్మకొండలో ఉన్న ఆయన ఇంట్లో కూడా ఎసిబి అధికారులు సోదాలు చేశారు. కేసు నమోదు చేసుకొని ఎఇని అరెస్టు చేసినట్లు ఎసిబి డిఎస్పీ సాయిబాబా తెలిపారు.

గేదెను ఢీకొని
నిలిచిపోయిన రైలు
సాంకేతిక లోపంతో నాలుగు గంటలు
నిలిచిపోయన అనువర్త్ ఎక్స్‌ప్రెస్
ఆలస్యంగా నడిచిన పలు రైళ్లు
మహబూబాబాద్, డిసెంబర్ 1 : భికనూర్ నుంచి చెన్నై సెంట్రల్‌కు వెళ్తున్న అనువర్త్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ మంగళవారం తెల్లవారుజామున వరంగల్ జిల్లా మానుకోట సమీపంలో గేదెను ఢీ కొట్టింది. ఈ ఘటనలో బ్రేకులు ఫెయిలై సాంకేతికలోపం సంభవించడంతో రైలును మానుకోట రైల్వే స్టేషన్ సమీపంలో నాలుగు గంటలపాటు నిలిపివేశారు. దీంతో ఇదే మార్గంలో విజయవాడ వెళ్లాల్సిన సింహపురి, మచిలీపట్నం, లింక్ ఎక్స్‌ప్రెస్‌లతోపాటు కాకతీయ ఫాస్ట్ ప్యాసింజర్ రెండు గంటలపాటు ఆలస్యంగా నడిచాయి. దీంతో తెల్లవారుజామున ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. సాంకేతిక లోపం తలెత్తిన విషయం తెలుసుకున్న రైల్వే సిబ్బంది హుటాహుటిన మానుకోటకు చేరుకుని సమస్యను పరిష్కరించారు. సాంకేతిక లోపాన్ని సరిచేయడంతో ఎక్స్‌ప్రెస్ రైలు సుమారు నాలుగు గంటల తరువాత బయలుదేరి వెళ్లిపోయింది.
గేదె పడడంతో మానుకోటలో నిలిచిపోయిన అనువర్త్ ఎక్స్‌ప్రెస్

కాపులను బిసిల్లో చేర్చవద్దు
ఎమ్మెల్యే కృష్ణయ్య డిమాండ్

హైదరాబాద్, డిసెంబర్ 1: కాపులను బిసిల్లో చేర్చరాదని టి.టిడిపి ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య సొంత పార్టీ అధ్యక్షుడైన, ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కోరారు. బిసి సామాజికవర్గంలో కాపులను చేర్చేందుకు తాను వ్యతిరేకమని ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ అన్నా రు. కాపులను బిసి సామాజికవర్గంలో చేర్చడం వల్ల బిసిలు అన్ని విధాలా నష్టపోతారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కాబట్టి ఈ అంశంపై చంద్రబాబు పునరాలోచన చేయాలని ఆయన కోరారు. కాపులను బిసిల్లో చేర్చేందుకు కమిషన్ నియమించడంపై బిసి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టేందుకు కృష్ణయ్య సిద్ధమవుతున్నారు.

సమష్టిగా ముందుకు సాగండి
పార్టీ బలోపేతానికి కృషి చేయండి

బిజెపి నేతలకు జాతీయ నేత సూచన

హైదరాబాద్, డిసెంబర్ 1: బిజెపి జిల్లా అధ్యక్షుల నియమాకాన్ని ఈ నెల 25వ తేదీలోగా పూర్తి చేసుకోవాలని ఆ పార్టీ నిర్ణయించింది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి అధ్యక్షతన మంగళవారం జరిగిన పార్టీ ముఖ్య నేతల, జిల్లా పార్టీ అధ్యక్షుల, ఇన్‌ఛార్జీల సమావేశానికి పార్టీ జాతీయ సంయుక్త కార్యదర్శి సౌదన్ సింగ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశంలో పార్టీ ఎన్నికల నిర్వహణపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా సౌదన్ సింగ్ ప్రసంగిస్తూ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్క కార్యకర్త పట్టుదలగా కృషి చేయాలని సూచించారు. ముఖ్యంగా కలిసి కట్టుగా ముందుకు వెళ్ళాలని ఆయన తెలిపారు.