తెలంగాణ

ఆలేరు బ్రిడ్జికి మోక్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 19: ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు చొరవతో ఆలేరు బ్రిడ్జికి మోక్షం లభించింది. రెండు నెలల నుంచి మూసివేసిన గేటును మంగళవారం తెరువనున్నారు. ఆలేరు పట్టణంలో ఇటీవల కొత్త రైల్వే బ్రిడ్జి నిర్మించాక, ఆలేరు రైల్వే గేటు మూసేశారు. దీంతో ఆ ప్రాంతం నుంచి వెళ్లే వారికి తీవ్రంగా ఇబ్బందులు అవుతోంది. హైదరాబాద్, నల్లగొండ జిల్లాల నుంచి వరంగల్ జిల్లా బచ్చన్నపేట, కొమురవెళ్లి, మెదక్ జిల్లా జగదేవ్‌పూర్, రంగారెడ్డి జిల్లా కీసర ప్రాంతాలకు వెళ్లే వారికి సమస్యగా మారింది. పాత రైల్వే గేటు ప్రాంతంలో రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మించాలని విప్ గొంగడి సునీత ముఖ్యమంత్రిని కోరారు. దీనికి అయ్యే వ్యయం 5కోట్ల 25లక్షలు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. దీన్ని నిర్మించేంత వరకు గేటును తెరవాలని రైల్వే శాఖను కోరారు. రైల్వే శాఖ సానుకూలంగా స్పందించింది. ఐదుకోట్ల నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో మంగళవారం నుంచి గేటు తెరువనున్నట్టు రైల్వే శాఖ తెలిపింది. ఆర్‌యుబికి ఐదుకోట్ల నిధులు మంజూరు చేయడంతో పాటు గేటు తెరిచేందుకు రైల్వే శాఖను ఒప్పించినందుకు విప్ గొంగడి సునీత ముఖ్యమంత్రి కెసిఆర్‌ను సోమవారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు.