తెలంగాణ

పోచంపల్లి సహకార బ్యాంకుకు 4జాతీయ అవార్డులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భూదాన్ పోచంపల్లి, సెప్టెంబర్ 19: దేశంలోని కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకులకు ప్రతి సంవత్సరం బ్యాంకింగ్, ప్రాంటియర్స్ ముంబై ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా మంజూరు చేసే జాతీయ అవార్డుల్లో నల్లగొండ జిల్లా భూదాన్‌పోచంపల్లిలోని కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకుకు 4 అవార్డులు దక్కాయ. 2015-16 ఆర్థిక సంవత్సరానికి ఈ అవార్దులు గెలుపొందినట్లు బ్యాంకు చైర్మన్ చిట్టిపోలు శ్రీనివాస్, సీత శ్రీనివాస్ తెలిపారు. సోమవారం మండల కేంద్రంలో వారు విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. బెస్ట్ ఎన్‌టిఎ, బెస్ట్ కార్డు, ఇనె్సంటివ్, బెస్ట్ వెహికిల్ లోన్, అచీవ్‌మెంట్, బెస్ట్ ఎటిఎంల నిర్వహణకు గాను ఈ నెల 18న ఢిల్లీలో జరిగిన జాతీయ కోఆపరేటివ్ బ్యాంకుల సమ్మేళనంలో పాలక మండలి అవార్డులను వరుసగా 5వసారి కైవశం చేసుకున్నట్టు పేర్కొన్నారు. బ్యాంకుపై ఖాతాదారులు ఉంచిన ప్రగాఢ విశ్వాసం, సిబ్బంది అందజేసే సేవల గుర్తింపుగా ఈ అవార్డులు లభించాయని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో టెక్నాలజీ సేవలు, యాప్ ద్వారా మొబైల్ బ్యాంకింగ్ సేవలు, నగదు డిపాజిట్ యంత్రాల స్థాపన, బిల్ పేమెంట్ సిస్టమ్ ఖాతాదారులకు అందుబాటులోకి తీసుకురానున్నామన్నారు. సమావేశంలో బ్యాంకు వైస్ చైర్మన్ రమేష్, డైరెక్టర్లు విజయ్‌కుమార్, పాండు, రఘు, బాలసుబ్రహ్మణ్యం, మధు, విష్ణు, రఘు, వేణు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

చిత్రం.. జాతీయ అవార్డు అందుకుంటున్న పోచంపల్లి
కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు పాలకమండలి