తెలంగాణ

విశ్వవిద్యాలయాల బంద్ ప్రశాంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/న్యూఢిల్లీ, జనవరి 27: రీసెర్చ్ స్కాలర్ రోహిత్ ఆత్మహత్యకు కారకులైన వారిని శిక్షించాలని కోరుతూ హెచ్‌సియూ విద్యార్థి జెఏసి ఇచ్చిన దేశవ్యాప్త బంద్ పిలుపు మేరకు బుధవారం దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాల బంద్ ప్రశాంతంగా జరిగింది. విద్యార్థి రోహిత్ ఆత్మహత్యపై విచారణలో జాప్యాన్ని నిరసిస్తూ విద్యార్థులు తరగతులను బహిష్కరించారు. హైదరాబాద్ వర్శిటీలో విసి అప్పారావును బర్తరఫ్ చేయాలని దళిత విద్యార్థి సంఘం ఆందోళన చేపట్టిన విషయం విదితమే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు యూనివర్సిటీలతోపాటు ఢిల్లీ, చెన్నైలలోని కేంద్రీయ విశ్వవిద్యాలయాలు బంద్ పాటించాయి. విద్యార్థులు నిరశన ప్రదర్శనలు నిర్వహించారు. చెన్నై రాజ్‌భవన్‌ను ముట్టడించేందుకు యత్నించిన 40 మంది విద్యార్థులను, దిల్లీలో శాస్ర్తీభవన్ వద్ద 60 మంది ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు.
అదేవిధంగా ఉస్మానియా యూనివర్శిటీలో బంద్ ప్రశాంతంగా జరిగింది. విద్యార్థి రోహిత్ ఆత్మహత్యను కొందరు రాజకీయం చేస్తున్నారని ఆరోపిస్తూ ఏఐఎస్‌ఎఫ్ విద్యార్థులు యూనివర్శిటీలో తరగతులు బహిష్కరించి నిరశన తెలిపారు. ఉస్మానియా యూనివర్శిటీలో విద్యార్థులు ఆర్ట్స్ కళాశాల నుంచి ఎసిసి గేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. వారిని అడ్డుకునేందుకు యత్నించగా పోలీసులు, విద్యార్థుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో పోలీసులు పలువురు విద్యార్థులను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి జెఎసి నాయకుడు బి స్టాలిన్ మాట్లాడుతూ విశ్వవిద్యాలయాలు స్వయం ప్రతిపత్తిని కోల్పోయి రాజకీయ నాయకుల కనుసన్నల్లో నడుస్తున్నాయని ఆరోపించారు.
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం హిందూత్వ ఏజెండాతో ఆర్‌ఎస్‌ఎస్ భావాలు కలిగిన వారిని విసిలుగా నియమించి కులవివక్షను పెంచిపోషిస్తోందని విమర్శించారు. విద్యార్థుల మధ్య చిచ్చుపెట్టే ఏ ప్రభుత్వమైనా ఎక్కువ కాలం మనలేదన్నారు. కులవివక్ష కారణంగా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడకుండా చూడాలని, హెచ్‌సియూలో శాంతి నెలకొల్పి రోహిత్ కుటుంబానికి న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
హైదరాబాద్‌లోని సెంట్రల్ వర్శిటీ గేటు బయట నినాదాలు చేస్తున్న విద్యార్థులు