అంతర్జాతీయం

దురాక్రమణలే పాక్ నైజం అందుకే మూడు యుద్ధాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జెనీవా, సెప్టెంబర్ 19: యూరి ఉగ్రవాద దాడి నేపథ్యంలో పాకిస్తాన్ నైజాన్ని విశ్వ వేదికపై భారత్ ఎండగట్టింది. ఆక్రమిత కాశ్మీర్‌ను తక్షణమే ఖాళీ చేయాలని డిమాండ్ చేసింది. ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడాన్ని కట్టిపెట్టాలని తెగేసి చెప్పింది. బలూచిస్తాన్‌లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనల గురించి, అక్కడ ఉంటున్న హిందువులపై సాగిస్తున్న దౌష్ట్యాల గురించీ ఐరాస మానవ హక్కుల 33వ సమావేశంలో భారత్ గట్టిగా ప్రస్తావించింది. భారత్‌లో ఏ ప్రాంతంలోనూ ఉగ్రవాదాన్ని, హింసాకాండను ప్రేరేపించకూడదని విస్పష్టంగా తెలియజేసింది. అలాగే తమ ఆంతరంగిక వ్యవహారాల్లో ఏ విధంగానూ జోక్యం చేసుకునే ప్రయత్నం చేయకూడదని ఉద్ఘాటించింది. బలూచిస్తాన్, ఖైబర్-్ఫక్తూన్‌ఖావ,సింధ్‌లలో పాక్ మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతోందని, మైనార్టీ హిందువులనూ దారుణంగా వేధిస్తోందని తెలిపింది. ఆక్రమిత కాశ్మీర్ నుంచి వైదొలగాలని పాకిస్తాన్‌ను ఆదేశించాలని ఐరాస మానవ హక్కుల మండలికి భారత్ విజ్ఞప్తి చేసింది. పాక్ ఆరోపణలకు సమాధానం చెప్పేందుకు తనకు గల హక్కును వినియోగించుకుని పొరుగు దేశం ఆగడాలను భారత్ సభ్య దేశాల దృష్టికి తెచ్చింది. జమ్ముకాశ్మీర్‌కు సంబంధించి తప్పుడు కధనాలు, వాదనలు, కల్పితాలతో మానవ హక్కుల మండలినే పాక్ తప్పుదోవ పట్టిస్తోందని తెలిపింది. ఆ విధంగా మండలి విజ్ఞతను, సహనానే్న పాక్ పరీక్షిస్తోందని తెలిపింది. 1947 నుంచీ కూడా కాశ్మీర్‌పై ప్రాదేశిక లక్ష్యాలను సాధించుకునేందుకే పాక్ ప్రయత్నిస్తూ వచ్చిందని..1947, 1965, 1999లో జరిగిన దురాక్రమణ ప్రయత్నాలే ఇందుకు నిదర్శనమని ఐరాస మానవ హక్కుల మండలికి గుర్తు చేసింది. ఇప్పటికీ కూడా కాశ్మీర్‌లోని 78వేల చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని పాక్ ఆక్రమించుకుందని వివరించింది. పాకిస్తాన్ ప్రేరేమిత ఉగ్రవాదమే కాశ్మీర్ అల్లర్లకు ప్రధాన కారణమని తెలిపింది. పాకిస్తాన్‌లోని ఇతర రాష్ట్రాలతో పాటు బలూచిస్తాన్ ప్రజలు రోజువారీ దారుణాలు, హింసాయుత వాతావరణానికి వ్యతిరేకంగా దశాబ్దాలుగా పోరాటం సాగిస్తూనే ఉన్నారని తెలిపింది. మతపరంగా, వర్గపరంగా మైనార్టీలుగా ఉన్న హిందువులు, క్రైస్తవులు, షియాలు తీవ్ర స్థాయిలోనే అన్ని విధాలుగా వివక్షను, దాడుల్ని ఎదుర్కొంటున్నారని భారత్ తెలిపింది. వీరికి చెందిన ప్రార్థనా స్థలాలను కూడా ధ్వంసం చేసిన సంఘటనలెన్నో జరిగాయని భారత్ వెల్లడించింది. ఇన్ని దారుణాలకు, ఆఘాయిత్యాలకు పాల్పడుతున్న పాక్‌కు సొంత ఇంటిని చక్కదిద్దుకోవాలని గట్టిగా చెప్పాల్సిన అవసరం ఉందని మానవ హక్కుల మండలిని భారత్ కోరింది.