తెలంగాణ

ఎస్సారెస్పీ ప్రధాన కాల్వకు గండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగిత్యాల, సెప్టెంబర్ 20: కరీంనగర్ జిల్లా జగిత్యాల డివిజన్ పరిధిలోని ఎస్సారెస్పీ ప్రధాన కాల్వ నుండి మానేర్ డ్యాంకు నీటిని తరలిస్తుండగా ప్రధాన కాల్వకు గండింది. దీంతో పలు గ్రామాల్లో పంటలు నీట మునిగాయి. నీరు ఉధృతంగా ప్రవహించడంతో మానాల ఊర చెరువు కింద గ్రామంలోని ఇళ్లతో పాటు పంటలకు తీవ్ర నష్టం జరిగింది. దాంతో పాటు మల్యాల మండలంలోని మ్యాడంపల్లి ఎస్సీ కాలనీలో నీరు చేరడంతో అక్కడి గ్రామీణులను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దానికి సమీప పెగడపల్లి మండలం సుద్దపల్లి వద్ద నీరు ఉధృతంగా ప్రవహించడంతో పంటలకు తీవ్రం నష్టం వాటిల్లింది. అలాగే గొల్లపల్లి మండలం చిల్వకోడూరు, రాఘవపట్నం వద్ద పంటలు నీటి ఉధృతానికి కొట్టుకుపోయాయి. విషయం తెలుసుకున్న జిల్లా అధికార యంత్రాంగం సహాయ చర్యలు ముమ్మరం చేసింది. గండిపడిన సమయం ఉదయం వేళ కావడంతో భారీ ప్రాణనష్టం తప్పింది. అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంటే తీవ్ర మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి నెలకొని ఉండేదని అధికారులు అభిప్రాయ పడుతున్నారు. జిల్లాకలెక్టర్ నీతూప్రసాద్, ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్ పరిస్థితి సమీక్షిస్తున్నారు.
ముంపుగ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తూనే సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.