తెలంగాణ

గేట్లెత్తారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేళ్లచెర్వు, కేతేపల్లి, సెప్టెంబర్ 22: భారీ వర్షాల వల్ల నల్లగొండ జిల్లాలోని డిండి, పులిచింతల ప్రాజెక్టులలోకి భారీగా వరద నీరు చేరుతోంది. మూసీ ప్రాజెక్టులో 7 క్రస్టుగేట్లను నాలుగు అడుగుల మేర ఎత్తి 16,500 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ఎడమకాల్వకు మరో 2వేల క్యూసెక్కుల నీటిని విడిచిపెట్టారు. కాగా 14వేల క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు కుడి కాల్వకు కొత్తపేట వద్ద గండిపడగా మరమ్మతులు చేస్తున్నారు.
పులిచింతలలో..
మేళ్లచెర్వు మండలం పులిచింతల ప్రాజెక్టు నిండుకుండలా ఉంది. ప్రస్తుత నీటినిల్వ 29.39 టిఎంసిలకు చేరుకుంది. 3 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తూండగా 17 గేట్లు ఎత్తి అదే పరిమాణంలో దిగువనున్న ప్రకాశం బ్యారేజ్‌కు నీటిని విడుదల చేస్తున్నారు. పులిచింతల బ్యాక్‌వాటర్ పెరగడంతో ముంపు గ్రామాలైన నెమలిపురి, వెల్లటూరు, అడ్లూరు గ్రామాలు సగానికి పైగా మునిగిపోయాయి. చింత్రియాల, పేబల్లెలో 20 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు.

చిత్రం.. మూసీ