తెలంగాణ

అలుగులు పారుతున్న చెరువులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 22: తెలంగాణలో గత వారం రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో మిషన్ కాకతీయ కింద చేపట్టిన పలు చెరువులు నీటితో నిండుకుండల్లాగా కనిపిస్తున్నాయి. మొదటి దశలో మిషన్ కాకతీయ కింద చేపట్టిన దాదాపు అన్ని చెరువుల్లో నీరు నిండి అలుగు పొర్లుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 2321 చెరువులు ఉండగా, వీటిలో 1239 చెరువులు అలుగు పోస్తున్నాయి. కరీంనగర్ జిల్లాలో 5939 చెరువులకు గాను 400 చెరువులు నిండు కుండలా ఉన్నాయి. వరంగల్ జిల్లాలో 5550 చెరువులకు గాను 1129 చెరువులు, ఖమ్మం జిల్లాలో 4517 చెరువులకు గాను 443 చెరువులు అలుగు పోస్తున్నాయి. నిజామాబాద్ జిల్లాలో మొత్తం 2311 చెరువులు ఉంటే వీటిలో 59 చెరువులు మాత్రమే అలుగు పోస్తున్నాయి. 1188 చెరువుల్లో 25శాతం వరకు నీరు చేరింది. గోదావరి బేసిన్‌లో మొత్తం 22,297 చెరువులకు గాను 3321 చెరువులు అలుగు పోస్తుండగా, 75శాతానికి పైగా నిండిన చెరువులు 5834 ఉన్నాయి. ఇక 9293 చెరువులు 50 శాతం నీటితో ఉన్నాయి. కృష్ణా బేసిన్‌లో మొత్తం 21,545 చెరువులు ఉండగా, వీటిలో 662 చెరువులు అలుగు పోస్తున్నాయి. 75శాతానికి పైగా నీరుచేరిన చెరువులు 841, 50శాతం నీరు చేరిన చెరువులు 2357 ఉన్నాయి. ఇక కృష్ణా, గోదావరి రెండు బేసిన్లలో కలిపి మొత్తం చెరువుల సంఖ్య 43,642 కాగా, వీటిలో 3989 చెరువులు అలుగు పోస్తున్నాయి.

చిత్రం.. నల్లగొండ జిల్లాలో ఉద్ధృతంగా అలుగు పారుతున్న పోచంపల్లి చెరువు