తెలంగాణ

‘నైరుతి ఉద్ధృతం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 22: నైరుతీ రుతుపవనాలు తెలంగాణలో ఉద్ధృతంగానూ, ఆంధ్రప్రదేశ్‌లో చురుగ్గానూ ఉన్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండి) తెలిపింది. ఐఎండి శాస్తవ్రేత్త బిపి యాదవ్ పేరుతో గురువారం ఒక బులెటిన్ జారీ అయింది. కోస్తాంధ్రలో అల్పపీడన ప్రభావం స్థిరంగా ఉందని, 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల తుపాను ద్రోణి ఏర్పడి ఉందని, ఇది ఆగ్నేయదిశగా కదులుతోందని వివరించారు. ఈ పరిస్థితిలో తెలంగాణలో వచ్చే రెండురోజుల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు, ఆ తర్వాత మరో రెండురోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే 48 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. నైరుతీ రుతుపవనాల ఉపసంహరణకు మరో 20 రోజుల సమయం ఉండగా, ఇవి బలంగా ఉండటం గమనార్హం. రుతుపవనాల ప్రభావం వల్ల ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి.
గత 24 గంటల్లో మచిలీపట్నంలో 12 సెంటీమీటర్లు, పాలేరుబ్రిడ్జి (కృష్ణా జిల్లా), కాకినాడలలో 11 సెంటీమీటర్లు, నాగర్‌కర్నూలులో 9 సెంటీమీటర్లు, నల్లబెల్లి (వరంగల్)లో 8, నవీపేట, ఎడపల్లి, భీంగల్ (నిజామాబాద్), తుని (ప.గో)లలో ఏడు సెంటీమీటర్లు, అచ్చంపేట (మహబూబ్‌నగర్), గుండాల (ఖమ్మం), జక్రాన్‌పల్లి, రెంజల్ (నిజామాబాద్), శాయంపేట (వరంగల్), సిరిసిల్ల (కరీంనగర్), బాపట్ల (గుంటూరు), ధవళేశ్వరంలలో ఆరు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉభయ రాష్ట్రాల్లోని ఇతర జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు కురిశాయి.
ఇలా ఉండగా తమిళనాడు, కర్నాటక, కేరళలో ఒక మోస్తరు వర్షాలు నమోదయ్యాయే తప్ప భారీ వర్షాలు లేవని ఐఎండి తెలిపింది.