రాష్ట్రీయం

హైదరాబాద్‌లో వర్ష బీభత్సం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 22: భారీ వర్షం గురువారం కూడా నగరాన్ని అతలాకుతలం చేసింది. గత వారం రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నప్పటికీ వరుసగా మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలు నగర ప్రజలను అతలాకుతలం చేశాయి. రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు అవుతోందని, హైదరాబాద్‌లో అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయని ముఖ్యమంత్రి కెసిఆర్ పేర్కొన్నారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. నిజాంపేటలో పలు అపార్ట్‌మెంట్లు నీటిలో మునిగిపోయాయి. సెల్లార్ వరకు నీటితో మునిగిపోవడంతో అపార్ట్‌మెంట్‌పై అంతస్తుల్లో ఉన్నవారు కిందికి రాలేకపోయారు. రెండు రోజుల నుంచి ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. చెరువు కింద, లోతట్టు ప్రాంతాల్లో నిర్మించిన కాలనీలు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. తురక చెరువునిండి ప్రవహిస్తుండడంతో నిజాంపేట అతలాకుతలం అయింది. నిజాంపేటలోని బండారి లే ఔట్ కాలనీ నీటిలో మునిగిపోయింది. గ్రామ పంచాయతీ ద్వారా ప్రజలకు తాగునీటిని, బ్రెడ్‌లను పంపిణీ చేశారు. హైదరాబాద్‌లో లోతట్టు ప్రాంతలు నీటిలో మునిగిపోవడంతో సైన్యం సహాయం కోసం ప్రభుత్వం అభ్యర్థించింది. అల్వాల్‌లో పెద్ద సంఖ్యలో ఉన్న మిలట్రీ కుటుంబాలు వరదలకు ఇక్కట్లు పడుతున్నాయి. అల్వాల్ చెరువు తెగి లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీటిలో మునిగిపోవడంతో సహాయ కార్యక్రమాలు అందించేందుకు సైన్యం ముందుకు వచ్చింది. స్థానికంగా సైనికులు సహాయ కార్యక్రమాలు చేపట్టారు. నగర వ్యాప్తంగా భారీ వర్షం కురవడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. వరద సహాయ కార్యక్రమాలకు పోలీసుల సేవలు ఉపయోగించుకుంటున్నారు. పోలీసు శాఖలోని వివిధ విభాగాలతో పాటు రాపిడ్ యాక్షన్ ఫోర్స్, ఆర్మీ, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ విభాగాల సహాయాన్ని తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించడంతో అధికారులు ఆయా విభాగాల అధిపతులను సహాయ కార్యక్రమాలకు సంప్రదించారు.
ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి హైదరాబాద్ వర్షాలపై జిహెచ్‌ఎంసి కమిషనర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. మరో రెండు రోజుల పాటు ఇదే విధంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తం అయింది. ముందు జాగ్రత్తగా లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. హుస్సేన్ సాగర్ నిండు కుండలా ఉంది. నాలుగు వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా అదే స్థాయిలో ఔట్ ఫ్లో ఉంది. పుకార్లను నమ్మవద్దని అధికారులు సూచించారు. నగరంలోని పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని జిహెచ్‌ఎంసి అధికారులు సూచించారు. అత్యవసరం అయితే తప్ప ఇంట్లో ఉండడం మంచిదని సూచించారు. అవసరం అయిన ఆహార పదార్థాలు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.
హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లా పరిధిలో భారీ వర్షాలు కురుస్తుండడంతో ఆ మూడు జిల్లాల అధికార యంత్రాంగం అప్రమత్తం అయింది. జిహెచ్‌ఎంసి కార్యాలయంలో మంత్రి కెటిఆర్, మేయర్ బొంతు రామ్మోహన్‌రావు, మంత్రులు, ఇతర అధికారులు సమావేశం అయి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.

చిత్రం.. రాజధానిలో నీట మునిగిన అపార్ట్‌మెంట్‌లో జనం కష్టాలు