తెలంగాణ

సురక్షిత ప్రాంతాలకు తరలండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ జీడిమెట్ల, సెప్టెంబర్ 22: ప్రకృతి విపత్తుతో వచ్చిన సమస్యను పరిష్కరించడానికి 72 గంటల సమయం పడుతుందని, ప్రజలు సహకరించి అపార్ట్‌మెంట్‌ల నుంచి ఖాళీ చేసి సురక్షిత ప్రాంతానికి తరలివెళ్లాలని రాష్ట్ర ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. జలమయమైన నిజాంపేట్ గ్రామం బండారి లేఅవుట్ కాలనీలో గురువారం మంత్రి గంటన్నర సేపునకు పైగా పర్యటించారు. మంత్రి వెంట జిల్లా కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు, జిహెచ్‌ఎంసి కమిషనర్ జనార్ధన్‌రెడ్డి, జలమండలి ఎండి దానకిషోర్, ఇరిగేషన్ ఎస్‌సి రాజశేఖర్‌లతో పాటు మేయర్ బొంతు రాంమోహన్, స్థానిక ఎమ్మెల్యే కెపి వివేక్, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యేలు కృష్ణారావు, అరికెపూడి గాంధీలు, ఇరిగేషన్, హెచ్‌ఎండబ్ల్యుఎస్, రెవెన్యూ, పోలీస్, ఫైర్, పంచాయతీ అధికారులు ఉన్నారు. వరద నీటిలోనే పాదయాత్రగా సాగిన మంత్రి అపార్ట్‌మెంట్‌లలోని ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. అపార్ట్‌మెంట్‌లలోకి నీరు రావడంతో మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులు పడుతున్న ఇబ్బందులను కెటిఆర్ అడిగి తెలుసుకున్నారు. రెండు రోజులుగా విద్యుత్, తాగునీరు లేకపోవడంతో పడుతున్న ఇబ్బందిని కాలనీ మహిళలు మంత్రికి విన్నవించారు. అధికారులు తమ సమస్యను పట్టించుకోవడం లేరని వివరించారు. దీనిపై స్పందించిన మంత్రి చెరువు నుండి వస్తున్న నీటిని మూడు అడుగుల లోతు తవ్వి తరలిస్తున్నారని, అవసరమైతే పది అడుగుల లోతు వరకు తవ్వి రోడ్డును పగులగొట్టి నీటిని సాధ్యమైనంత త్వరలో తరలించేందుకు అధికార యంత్రాంగం పనిచేస్తున్నదని తెలిపారు. కాలనీ వాసులు ఎలాంటి ఇబ్బందులు పడకూడదని, అధికారుల ద్వారా తాగునీరు, పాలు, బ్రెడ్, పిల్లలకు బిస్కెట్‌లను పంపిణీ చేయిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం తుర్క చెరువు తూమును, చెరువు కట్టను, అలుగును మంత్రి క్షుణ్ణంగా పరిశీలించారు. చెరువు మ్యాప్‌ను పరిశీలించారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ శతాబ్దం తరువాత చరిత్రలో ఎన్నడూ రాని విధంగా 23 సెంటీమీటర్ల వర్షపాతం ఇక్కడ పడిందని తెలిపారు. సంవత్సరానికి 32 సెంటీమీటర్ల వర్షపాతం రావాలని, కానీ, ఒకేరోజు 23 సెంటీమీటర్ల వర్షం కురవడంతో సమస్య ఉత్పన్నమైందని అన్నారు. మళ్లీ వర్ష సూచన ఉందని, కాలనీకి వచ్చే నీటికి అడ్డుకట్ట వేస్తామన్నారు. పెద్దతూము నుండి అవసరమైతే మరింత పెద్దగా తూమును తీసి నీటిని తరలిస్తామని చెప్పారు. సమస్యను పరిష్కరించేందుకు 48 గంటల నుంచి 72 గంటల వరకు సమయం పడుతుందని, అప్పటి వరకు కాలనీవాసులు సురక్షిత ప్రాంతానికి వెళ్లాలని మంత్రి సూచించారు. సెల్లార్‌లలోని నీటిని ఫైరింజన్‌లతో తొలగిస్తున్నామని తెలిపారు. చెరువు నుంచి నీటిని కృత్రిమంగా మూడు ఫీట్ల తూము ద్వారా ప్రగతినగర్ చెరువుకు తరలిస్తున్నామని, అవసరమైతే 10 ఫీట్ల తూమును తీసి త్వరగా నీటిని తరలిస్తామని చెప్పారు. ప్రగతినగర్ చెరువు పూర్తిగా ఆక్రమణలకు గురైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలో చాలా చోట్ల ఇలాంటి పరిస్థితి ఉందని మంత్రి పేర్కొన్నారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో కంట్రోల్ రూమ్ ద్వారా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని వివరించారు. లోతట్టు ప్రాంతాల నుండి ప్రజలను రెవెన్యూ యంత్రాంగం తరలిస్తున్నట్టు చెప్పారు.
ఈ విపత్తును సవాలుగా తీసుకుని నగరంలో సెవరల్ వ్యవస్థను, రోడ్ల వ్యవస్థను, మురుగునీటి కాలువ వ్యవస్థను ఆధునీకరించేందుకు ముందుకు వెళతామని స్పష్టం చేశారు. రాబోవు సంవత్సర కాలంలో హైదరాబాద్ నగరాన్ని ఆధునీకరిస్తామన్నారు. సమస్యలను పూర్తిగా తలెత్తకుండా చేస్తానని చెప్పడం అతిశయోక్తి అవుతుందని అన్నారు. ఆధునీకరించేందుకు సుమారుగా రూ.20 వేల కోట్లు కావాలని, సంవత్సర కాలంలో అన్ని పనులు కాలేవని, అవస్థను, సమస్యను తగ్గించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని చెప్పారు.
నాలాల ఆక్రమణలపై 2003లో కులోస్కర్ కమిటీ నివేదిక ప్రకారం 28వేల నిర్మాణాలు ఉన్నాయని, ఈ మధ్య కాలంలో అవి మరింతగా పెరిగి ఉండవచ్చని అన్నారు. నాలాల ఆధునీకరణపై బెంగళూరులో కోర్టు ఆదేశాల మేరకు బిల్డింగ్‌లను తొలగించారని గుర్తుచేశారు.

చిత్రం.. నిజాంపేటలోని బండారి లేఅవుట్ కాలనీలో పర్యటిస్తున్న మంత్రి కెటిఆర్,
కలెక్టర్ రఘునందన్‌రావు, మేయర్ రాంమోహన్, ఎమ్మెల్యేలు కెపి వివేక్, గాంధీ, కృష్ణారావు