తెలంగాణ

మత్తు మందులు విక్రయస్తున్న ఐదుగురి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 22: మహబూబ్‌నగర్ పట్టణంలో గుట్టుచప్పుడుగా మత్తుమందుల విక్రయస్తున్న మెడికల్ షాపుపై పోలీసులు గురువారం రాత్రి దాడులు చేశారు. ఇక్కడి మోడ్రన్ చౌరస్తాలో లక్ష్మీప్రసన్న మెడికల్ అండ్ జనరల్ స్టోర్ యాజమాని రమణ విద్యార్థులకు గుట్టుచప్పుడు కాకుండా మత్తుమందులను విక్రయిస్తున్నారు. ఈ విషయెం తెలియడంతో గురువారం రాత్రి 10.30 గంటల సమయంలో వన్‌టౌన్ సిఐ సీతయ్య పోలీస్ బలగాలతో దాడులు నిర్వహించారు. అప్పటికే మత్తుమందులు విక్రయిస్తున్న మెడికల్ షాపు యాజమాని రమణ, తిరుమల హోల్‌సెల్ మెడికల్ ఎజెన్సీ మహేష్‌తో పాటు కొనుగోలు చేస్తున్న ముగ్గురు విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు 192 మత్తు ఇంజక్షన్లను స్వాధీనం చేసుకుని పట్టుబడిన వారిని అరెస్టు చేశారు. ఈ విషయంపై సిఐ సీతయ్య మాట్లాడుతూ మహబూబ్‌నగర్ పట్టణంలో మత్తుమందు దందా కొనసాగుతోందని సమాచారం తెలియడంతో దాడులు చేసి ఐదుగురిని అరెస్టు చేశామని వెల్లడించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

చిత్రం.. మత్తుమందు అమ్ముతున్న వారితో పాటు కొనుగోలు చేస్తున్న వారిని అరెస్టు చేసిన ట్లు విలేఖరులకు వివరిస్తున్న సిఐ సీతయ్య