తెలంగాణ

వరి క్వింటాలుకు రూ.1470 మద్దతు ధర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 22: ఈ సంవత్సరం 2300 కేంద్రాల ద్వారా 30లక్షల టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు పౌర సరఫరాల శాఖ కమిషనర్ సివి ఆనంద్ తెలిపారు. గత ఏడాది ఖరీఫ్ సీజన్‌లో 1671 కేంద్రాల ద్వారా 15లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా, ఈసారి 2300 కేంద్రాల ద్వారా 30లక్షల టన్నులు కొనుగోలు చేయనున్నట్టు చెప్పారు. వరి సాధారణ రకానికి క్వింటాలుకు 1470 ఏ గ్రేడుకు 1510 రూపాయల మద్దతు ధర నిర్ణయించినట్టు తెలిపారు. ఐకెపి, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు, పౌర సరఫరాల సంస్థ, డిసిఎంఎస్ తదితర ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. ధాన్యం కొనుగోలుకు అవసరమై మూడు కోట్ల 41లక్షల గోనె సంచులను, ధాన్యం సేకరణ కేంద్రాల్లో కంప్యూటర్లు, దాదాపు రెండు వేల ట్యాబ్‌లను అందుబాటులో ఉంచామని చెప్పారు. ధాన్య సేకరణకు సంబంధించిన పూర్తి వివరాలను ఆన్‌లైన్‌లోనే నమోదు చేయాలని మిల్లర్లను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాలు రైతులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.