తెలంగాణ

పోలీసులపై తిరగబడ్డ ప్రజలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 23: గద్వాల జిల్లా ఏర్పాటు చేయాలని జరుగుతున్న ఆందోళనలు తార స్థాయికి చేరుకున్నాయి. గద్వాల జె ఎసి, అఖిలపక్షం ఆద్వర్యంలో మూడు రోజుల సకల జనుల బంద్‌కు పిలుపునిచ్చారు. అందులో బాగంగా శుక్రవారం సకల జనుల బంద్ సందర్భంగా జనమంతా రోడ్లపైకి వచ్చి గద్వాల పట్టణంలో కవాతు నిర్వహించారు. సకల జనుల బంద్ సందర్భంగా గద్వాల ఆర్టిసీ డిపో మూతపడింది. బస్సులు డిపోలకే పరిమితం అయ్యిపోయాయి. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు మూతపడ్డాయి. గద్వాలలో బంద్ సంపూర్ణంగా కొనసాగింది. వ్యాపారస్థులు స్వచ్చందంగా బంద్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గద్వాల పట్టణంతో పాటు ధరూర్, మల్దకల్, గట్టు మండలాలకు సంబందించిన వేలాది మంది జనం ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చి గద్వాల జిల్లాను ఏర్పాటు చేయాలని నినాదించారు. కొందరు సెల్ టవర్లు ఎక్కి గంటల తరబడి హల్‌చల్ సృష్టించారు. విద్యార్థులు, యువకులు ఆగ్రహంతో ఊగిపోతూ రోడ్లపై మంటలు పెట్టారు. దింతో కొందరినైన ఆరెస్టు చేసి రోడ్లపైకి జనం రాకుండా చూడాలనుకున్న పోలీసులకు చెదు అనుభవం ఎదురైంది. విద్యార్థులను, యువకులు, జె ఎసి నాయకులను పోలీసులు ఆరెస్టు చేయడానికి యత్నించడంతో ఒక్కసారిగా పోలీసులపైకి జనం తిరగబడ్డారు. ఓ సందర్భంలో జనాగ్రహం కట్టలు తెంచుకుంది. పోలీసుల వాహనాలపైకి ఎక్కి జనం ఆగ్రహంతో ఊగిపోతూ పోలీసులకు, ముఖ్యమంత్రి సి ఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తతంగా మారడంతో పోలీసులే సంయమనం పాటిస్తూ పోలీసులు వెనుదిరిగిసపోయారు. ప్రధాన రోడ్లన్ని ఆందోళనతో అటోడికిపోయాయి. పోలీసు వాహనాలపై ఎక్కి ఆందోళనకు దిగిన యువకులు పోలీసులు వెనుదిరిగి వెళ్లిపోవడంతో శాంతించారు. గద్వాల జిల్లా కోసం జరుగుతున్న ఉద్యమం తీవ్ర ఉద్రిక్తతలకు, ఆక్రోశాలకు దారి తీస్తుంది. ప్రభుత్వం జిల్లాల విభజన ముసాయిదాపై ఈ నెల 26వ తేదిన తుది ముసాయిదాను ప్రకటించనున్న నేపథ్యంలో గద్వాలలో జరుగుతున్న ఉద్యమానికి ముఖ్యమంత్రి కెసిఆర్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారోననే అంశం కూడా చర్చనీయాంశంగా మారింది. మరో రెండు రోజుల పాటు సకల జనుల బంద్ ఉండడంతో ఎలాంటి పరిస్థితులు తలెత్తనున్నాయోనని జిల్లా పోలీసు యంత్రాంగం గట్టి నిఘాను ఉంచారు.

చిత్రం.. గద్వాలలో పోలీసుల వాహనాలను చుట్టుముట్టి ఆందోళన చేస్తున్న జనం