తెలంగాణ

జలదిగ్బంధంలో ఏడుపాయల ఆలయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాపన్నపేట, సెప్టెంబర్ 24: ఏడుపాయల ఘణపురం ప్రాజెక్ట్‌లో మంజీరా పొంగిపొర్లుతూ పరవళ్లు తొక్కుతుంది. పరీవాహక ప్రాంతంలో పుష్కలంగా వర్షాలు కురియడం, సింగూర్ ప్రాజెక్ట్ నుంచి భారీగా నీరు విడుదల అవడంతో ఘణపురం ప్రాజెక్ట్‌పై నుంచి ఏడుపాయల వనదుర్గామాత ఆలయం ముందునుంచి ప్రమాద స్థాయిలో మంజీరా నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో శ్రీ ఏడుపాయల ఆలయం జలదిగ్బంధంలో చిక్కుకుంది. భక్తులు దుర్గామాత ఆలయానికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఆలయ కార్యనిర్వహణ అధికారి టి.వెంకటకిషన్‌రావు ముందస్తుగా ఆలయాన్ని మూసివేశారు. వనదుర్గామాతకు గర్భాలయంలో జరగాల్సిన నిత్యపూజలు నిలిచిపోయాయి. రాజగోపురం వద్ద వనదుర్గామాత ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేసి అమ్మవారికి నిత్యపూజలు నిర్వహిస్తున్నారు. ఘణపురం ప్రాజెక్ట్ పొంగిపొర్లడంతో, ఏడుపాయల ఆలయం జలదిగ్బంధంలో చిక్కుకున్న విషయాన్ని తెలుసుకున్న తెలంగాణ శాసనసభ ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి, మెదక్ జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రాస్, మెదక్ ఆర్డీఓ మెంచు నగేష్, మెదక్ డిఎస్పీ నాగరాజు, ఇరిగేషన్ ఇఇ ఏసయ్య తదితర అధికారులు శనివారం ఏడుపాయలను సందర్శించారు. మంజీర ఉద్ధృతంగా ప్రవహిస్తున్న తీరును వారు పరిశీలించారు. అనంతరం రాజగోపురంలో ఉన్న వనదుర్గామాతకు ఉపసభాపతి, జిల్లా కలెక్టర్ తదితర అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.