తెలంగాణ

వరద ఉద్ధృతిలో చిక్కుక్కున్న ఎల్లారెడ్డి ఎమ్మెల్యే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామారెడ్డి, సెప్టెంబర్ 25: నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట్ మండలాల్లో వరదనీటికి దెబ్బతిన్న పంటలను పరిశీలించి వస్తున్న ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి కామారెడ్డి నిజాంసాగర్ చౌరస్తాలోని లయోల పాఠశాల వద్ద భారీ వరదనీటి ప్రవాహంలో చిక్కుకు పోయింది. దీంతో సమాచారం అందుకున్న పోలీసుల హుటాహుటిన శనివారం రాత్రి చేరుకుని జెసిబి వాహనంతో ఎమ్మెల్యేను వరదనీటి నుండి దాటించి ఆర్‌అండ్‌బి అతిథి గృహానికి చేర్చారు. అలాగే సిరిసిల్లా రోడ్డులో భారీగా వరద నీరు ప్రవహించినప్పుడు మహారాష్టక్రు చెందిన బస్సు ఆగిపోయింది. దీంతో ప్రయాణికులు ఆందోళనకు గురికాగా పోలీసులు చేరుకొని ప్రయాణికులను సురక్షితంగా బైపాస్ రహదారి మీదుగా పంపించారు. అలాగే హౌసింగ్ బోర్డులో జిఆర్ కాలనీలో భారీ వర్షం నిలవడంతో డిఎస్పీ భాస్కర్ ఆధ్వర్యంలో శనివారం రాత్రి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.