తెలంగాణ

నివేదిక పంపితే కేంద్ర బృందం వస్తుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 26: వర్షబీభత్సం, నష్టాలపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్రమైన నివేదికను కేంద్రానికి పంపిస్తే, అధ్యయనానికి అధికారుల బృందాన్ని పంపిస్తుందని కేంద్ర పట్టణాభివృద్ధి, సమాచార శాఖ మంత్రి ఎం. వెంకయ్య నాయుడు తెలిపారు. సోమవారం తన నివాసంలో బిజెపి ప్రజాప్రతినిధులతో, పార్టీ ఇతర నాయకులతో సమావేశమై చర్చించారు.
వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టం విషయంలో కేంద్రం అన్ని విధాలా సహాయాన్నిస్తుందన్నారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ, గృహ నిర్మాణ పథకం, జవహర్‌లాల్ నెహ్రూ అర్బన్ రెన్యూవల్ మిషన్ ద్వారా సహాయం అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన వారికి వివరించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ముందుగా నష్టం అంఛనాలతో నివేదిక పంపించాల్సి ఉంటుందని అన్నారు.
జీయర్ తిరునక్షత్ర కార్యక్రమానికి ఆహ్వానం
నగరంలోని ఎల్‌బి స్టేడియంలో నవంబర్ 6వ తేదీన సాయంత్రం 6 గంటలకు శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి తిరునక్షత్రం కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడును కోరారు.