తెలంగాణ

చెరువులకు జలకళ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 26: మిషన్ కాకతీయ పథకం కింద చేపట్టిన చెరువులు నీటితో కళకళలాడుతున్నాయి. సాధారణ వర్షపాతానికే చెరువులకు గండిపడి తెగేవి. కానీ అసాధారణ స్థాయిలో వర్షాలు కురుస్తున్నా మిషన్ కాకతీయ పథకం కింద పునరుద్ధరించిన చెరువులు నిండు కుండల్లా కళకళలాడుతున్నాయి. తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ ఇలానే ఉంది. ఆదిలాబాద్ జిల్లాలో మిషన్ కాకతీయ పథకం కింద 3821 చెరువులను పునరుద్ధరించగా, 1904 అలుగు పోశాయి. 1262 చెరువులు 75శాతం నుంచి వంద శాతం నిండాయి. కరీంనగర్‌లో 5598 చెరువుల్లో 1495 చెరువులు అలుగు పోశాయి. మరో 1552 చెరువులు 75శాతం నుంచి వంద శాతం వరకు నీటితో నిండాయి. వరంగల్ జిల్లాలో 5550 చెరువుల్లో 3622 చెరువులు అలుగు పోశాయి. మరో 1403 చెరువుల్లో 75శాతం నుంచి వంద శాతం నిండిపోయాయి. నిజామాబాద్‌లో 2811చెరువుల్లో 2051 చెరులు అలుగు దాటుతున్నాయి. మరో 539 చెరువులు వంద శాతం నిండే దశలో ఉన్నాయి. మెదక్‌లో 7726 చెరువుల్లో 6544 చెరువులు అలుగు పోస్తున్నాయి. మరో 569 చెరువులు 75 నుంచి వంద శాతం పూర్తి స్థాయిలో నిండే దశలో ఉన్నాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో 6287 చెరువుల్లో 380 చెరువులు అలుగు పోశాయి. మరో 332 చెరువులు కూడా వంద శాతం నిండిపోనున్నాయి. రంగారెడ్డి జిల్లాలో 3743 చెరువుల్లో 871 చెరువులు అలుగు పోశాయి. మరో 381 చెరువులు పూర్తిగా నిండే దశలో ఉన్నాయి. నల్లగొండ జిల్లాలోని 4762 చెరువులకు 1568 చెరువులు మత్తడి దూకుతున్నాయి. మరో 1077 చెరువులు 75నుంచి వంద శాతం వరకు నిండాయి. 4282 చెరువులు 50 శాతం వరకు నిండాయి.
మిషన్ కాకతీయ మంచి ఫలితాన్ని ఇచ్చిందని నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు మిషన్ కాకతీయలో పని చేసిన సిబ్బందిని, ప్రజాప్రతినిధులను అభినందించారు. మానాల చెరువు కట్ట పటిష్టంగా ఉన్నందున దానికి దిగువన ఉన్న 11 చెరువులు వరదకు తెగిపోలేదని ముఖ్యమంత్రి కెసిఆర్ కరీంనగర్ సభలో చెప్పడానికి హరీశ్‌రావు ప్రస్తావించారు. మిషన్ కాకతీయ మొదటి దశ, రెండవ దశ పనులన్నీ ఫలితాలనిస్తున్నాయని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు, యంత్రాంగాన్ని నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అభినందించారు. చెరువులు నిండుకుండలా కనిపించడంతో తెలంగాణ పల్లెలు జలకళ సంతరించుకున్నాయని తెలిపారు.