తెలంగాణ

రోడ్లు, సాగునీటి వనరులకే ఎక్కువ నష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 27: రెండు వారాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని ముంచెత్తిన భారీ వర్షాలు, వరదల వల్ల వాటిల్లిన నష్టంపై రెవిన్యూశాఖ కసరత్తు చేస్తోంది. మొదటి వారంలో కురిసిన వర్షాల వల్ల కలిగిన నష్టంపై కలెక్టర్ల నుంచి ప్రభుత్వానికి ఇప్పటికే ప్రాథమిక సమాచారం అందింది. అయితే రెండు రోజులుగా వర్షాలు తగ్గుముఖం పట్టడంతో నీట మునిగిన పంటల వల్ల కలిగిన నష్టాన్ని అధికారులు సేకరిస్తున్నారు. శనివారం కల్లా జిల్లాల నుంచి వర్షాలు, వరదల వల్ల కలిగిన నష్టంపై నివేదికలు వస్తాయని అధికారులు భావిస్తున్నారు. శనివారం లోగా నివేదికలు ప్రభుత్వానికి అందితే జరిగిన నష్టంపై కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ మంత్రిమండలిలో తీర్మానం చేసే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తుంది. ఈ నెల 26న జరగాల్సిన తెలంగాణ మంత్రిమండలి సమావేశం వాయిదా పడటంతో ఈ నెలాఖరులోగా మంత్రిమండలి సమావేశం కానుంది. ఆ లోగా జిల్లాల నుంచి తుది నివేదికలు అందితే కేంద్రాన్ని ఎంత సహాయం కోరాలనేది మంత్రిమండలిలో నిర్ణయించడానికి వీలు కలుగుతుందని ప్రభుత్వం భావిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాథమికంగా అందిన నివేదిక ప్రకారం రూ. 173 కోట్ల నష్టం వాటిల్లినట్టు అంచనా వేసింది. జిల్లాల నుంచి అందిన ప్రాథమిక అంచనాల మేరకు పంటనష్టం కంటే రోడ్లు, ప్రభుత్వ భవనాలు, ఇళ్లు, చెరువులు, కుంటలు తదితర చిన్ననీటి వనరులకు జరిగిన నష్టం ఎక్కువగా ఉన్నట్టు జిల్లాల నుంచి ప్రాథమిక సమాచారం అందినట్టు రెవిన్యూ వర్గాల సమాచారం. జిల్లాల్లో కంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) పరిధిలో వౌలిక సదుపాయాలకు ఎక్కువ నష్టం వాటిల్లినట్టు ప్రభుత్వానికి ప్రాథమిక సమాచారం అందింది. జిహెచ్‌ఎంసి పరిధిలో భారీ వర్షాలు, వరదల వల్ల సుమారు రూ. 100 కోట్లు, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రూ. 35 కోట్ల నష్టం వాటిల్లినట్టు ప్రాథమిక సమాచారం. రాష్ట్ర పరిధిలోని జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులకు సుమారు రూ. 10 కోట్ల నష్టం జరిగినట్టు ఆర్ అండ్ బి శాఖకు ప్రాథమిక సమాచారం అందింది. పంచాయతీరాజ్ పరిధిలో 200 కి.మీ మేరకు రోడ్లు దెబ్బతిన్నట్టు ప్రాథమిక సమాచారం అందింది. పంట నష్టం ఎక్కువగా మెదక్, వరంగల్, కరీంనగర్, రంగారెడ్డి జిల్లాల్లో జరిగినట్టు సమాచారం. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం అత్యధికంగా మెదక్ జిల్లాలో లక్ష 33 వేల 444 ఎకరాలలో, రంగారెడ్డి జిల్లాలో 30 వేల ఎకరాలలో పంట నష్టం జరిగింది. అన్ని శాఖల నుంచి నష్టం అంచన నివేదికలు వచ్చే సరికి జరిగిన నష్టం రూ. 500 కోట్లకు చేరుకునే అవకాశం ఉండవచ్చని రెవిన్యూశాఖ వర్గాలు అంచన వేస్తున్నాయి. కేంద్రం నుంచి వివిధ గ్రాంట్ల కింద సహాయం కోరడానికి మొత్తంగా, విడివిడిగా శాఖల వారీగా నివేదికలు రూపొందించాలని ప్రభుత్వం భావిస్తుంది. శనివారం సాయంత్రానికల్లా జిల్లాల నుంచి పూర్తిస్థాయి నివేదికలు అందాలని కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఆదేశించారు.