రాష్ట్రీయం

వెంకయ్య సన్మానంలో అమిత్‌షాకు అవమానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 27: ఏపిలో బిజెపి నాయకులు పార్టీ జాతీయ అధ్యక్షుడినే మర్చిపోతున్నారా? ప్రధానికి సముచిత స్థానం ఇవ్వాలన్న విషయం కూడా విస్మరిస్తున్నారా? తాజాగా తెనాలిలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుకు జరిగిన సన్మానసభ, దానికోసం పార్టీ నేతలు ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలు, ఆహ్వానపత్రాలు పరిశీలిస్తే ఇది నిజమేననిపిస్తోంది. పార్టీ అధ్యక్షుడి ఫొటో లేకుండానే సన్మానం జరిగిన తీరుపై అటు బిజెపి సీనియర్లు కూడా అసంతృప్తితో ఉన్నారు. రాష్ట్భ్రావృద్ధికి ప్యాకేజీ సాధించడంలో కీలకపాత్ర పోషించి, రాష్ట్రానికి నిధుల విడుదలలో చొరవ చూపిస్తున్న కేంద్రమంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడుకు గుంటూరు జిల్లా తెనాలిలో ఆ జిల్లా నేతలు భారీ సన్మానం చేశారు. ఆయనను స్వాగతిస్తూ ఫ్లెక్సీలు, ఆహ్వానపత్రాలు ఏర్పాటుచేశారు. వెంకయ్యను సన్మానించిన వేదికపై తెదేపా అధ్యక్షుడు, ఏపి సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి పత్తిపాటి పుల్లారావు, తెనాలి తెదేపా ఎమ్మెల్యే ఆలపాటి రాజా ఫొటో వేసిన జిల్లా పార్టీ నాయకత్వం, తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఫొటో వేయడం మాత్రం విస్మరించారు. వేదికమీద తెదేపాకు చెందిన మంత్రి పుల్లారావు, ఎమ్మెల్యే రాజాకు సముచిత స్థానం కల్పించిన తమ జిల్లా నాయకత్వం జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఫొటో వేయకపోగా, ప్రధాని మోదీ ఫొటో సైజును చిన్నదిగా వేయడంపై పార్టీ సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన కొన్ని ఫ్లెక్సీలలో అసలు మోదీ-అమిత్‌షా లేకపోగా, ఒక ఫ్లెక్సీలో జిల్లా, రాష్ట్ర స్థాయి నేతలతో సమానంగా ప్రధాని మోదీ ఫొటో ఉంచడంపై పార్టీ సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అయితే, వెంకయ్యనాయుడుకు దీనితో సంబంధం లేదని, ఆయనను మెప్పించేందుకు కొందరు నాయకులు అత్యుత్సాహం ప్రదర్శించి, అమిత్‌షా ఫొటో లేకుండా, ప్రధానికి సరైన స్థానం కల్పించకుండా అవమానించారని పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.