తెలంగాణ

కొండా లక్ష్మణ్ జీవితం ఓ పుస్తకం వంటిది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/కాచిగూడ, సెప్టెంబర్ 27: తెలంగాణ స్వాతంత్ర సమరయోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అశయాలను సాధించుకునే దిశగా ప్రయత్నం చేస్తామని తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖమంత్రి జోగు రామన్న అన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ 101వ జయంతిని మంగళవారం బాగ్‌లింగంపల్లి ఆర్టీసీ కళాభవన్‌లో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ పోరాట యోధులను స్మరించుకుంటామన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ రాజకీయాలకు అతీతంగా సలహాలు ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. బాపూజీ విగ్రహం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైన ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ దృష్టికి తీసుకెళ్లి త్వరలో విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు. బిసిలు అందరూ ఐక్యంగా ఉండి తమ హక్కుల సాధనకు కృషి చేయాలన్నారు. శాసన మండలి చైర్మన్ కె. స్వామిగౌడ్ మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం ఓ పుస్తకం అని కొనియాడారు. బడుగు, బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం అనేక ఉద్యమాలకు శ్రీకారం చుట్టారని తెలిపారు. నగరంలో బిసి సాధికారిత భవన్‌ను ఏర్పాటు చేసి వాటిలో జయంతి ఉత్సవాలను నిర్వహించాలని సూచించారు. కుల వృత్తులను సమన్వయం చేసి వారి అభివృద్ధికి కృషి చేయాలన్నారు. హోం శాఖ మంత్రి నాయిని నర్సింహా రెడ్డి మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని పేర్కోన్నారు. బిసి అభ్యున్నతి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కెసి ఆర్ అనేక పథకాలను ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు. బడుగు, బలహీన వర్గాల ప్రజలు బాగుపడినప్పుడే రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయని అన్నారు. కులవృత్తులను ప్రోత్సహిస్తామని, సంచార జాతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ 1969లోనే తన మంత్రి పదవిని వదులుకుని తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించిన పోరాట యోధుడు లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు. ఆదిలాబాద్ జిల్లాను కొండా లక్ష్మణ్ బాపూజీ జిల్లాగా నామకరణం చేయాలని తెలిపారు. బిసి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాజుల శ్రీనివాస్ గౌడ్ సభాధ్యక్షత వహించారు. ఇంకా ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు కె.కేశవరావు, రాపోలు ఆనంద భాస్కర్, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య, గుజ్జకృష్ణ, కొండూరి సత్యనారాయణ పాల్గొన్నారు.