తెలంగాణ

మహిళలే మేనేజర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, సెప్టెంబర్ 28: సువిశాలమైన భారతదేశ పరిపాలనను అప్పగిస్తే ప్రధాని హోదాలో ఇందిరాగాంధీ అద్భుతంగా ముందుకు నడిపించారు. అదే తరహాలో కుటుంబ పెత్తనాన్ని విజయవంతంగా ముందుకు నడిపించే బాధ్యతను ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల మహిళలు స్వీకరించాల్సిన అవసరం ఉందని సిఎం కె చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. తాను దత్తత తీసుకున్న ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల్లో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనులను పరిశీలించిన అనంతరం బుధవారం మధ్యాహ్నం రెండు గ్రామాల ప్రజలను ఉద్దేశించి కొత్త కమ్యూనిటీ హాలులో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. ఉన్న వనరులను వాడుకుంటూ ఒకరికొకరు సహకరించుకుని ఆదర్శ గ్రామాలుగా నిలుపాలనే ఉద్దేశంతో ప్రయాణం ప్రారంభమైందని గుర్తు చేశారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణంలో జాప్యమైందని, వర్షాల వల్ల గుడిసెల్లో ఉంటూ కష్టాలు పడ్డారని మరికొద్ది రోజులు సహనం వహిస్తే కొత్త ఇళ్లలోకి వెళ్లవచ్చన్నారు. ఈ యేడాది పుష్కళంగా వానలు పడతాయని ముందే చెప్పానని, అసాధారణ వర్షాలతో కళకళలాడుతున్న చెరువులు, కుంటలు, ప్రాజెక్టులను చూస్తుంటే ఆనందం పొంగిపొర్లుతోందని సంతృప్తి వ్యక్తం చేసారు. రెండు గ్రామాల చుట్టూ నిర్మిస్తున్న చెక్‌డ్యాంలు, చెరువులు, రిజర్వాయర్లలో వచ్చే రెండేళ్లలో 365 రోజులు అవసరమైనంత నీరు నిల్వ ఉంటుందన్నారు. వచ్చే ఏడాది కూడా కాలం సక్రమంగానే ఉంటుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. వర్షాభావ పరిస్థితులు పోయాయని, దశాబ్దకాలం దేశంలో మంచి వానలు పడతాయన్నారు. ప్రకృతి సహకారం ఆశిస్తూ అమ్మవారికి దండం పెట్టుకుందామన్నారు. మల్లన్న సాగర్ వివాదం రెండు మూడు రోజుల్లో పరిష్కారం అవుతుందన్నారు. దీంతో రెండేళ్లలో గోదావరి జలాలు రానున్నాయని స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లా అంకాపూర్ మాదిరిగా రెండు గ్రామాలను ఆదర్శవంతంగా అభివృద్ధి చేసుకోవాలని సూచిస్తూ, మహిళల పెత్తనంపైనే అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. కేవలం ఈ రెండు గ్రామాలను అభివృద్ధి చేస్తే సరిపోదని, తెలంగాణ రాష్ట్భ్రావృద్ధికి ఇక్కడే పునాది వేసామన్నారు. కూర్చున్న చోటే సంపాదించాలన్న పగటి కలలు కట్టిపెట్టి, కష్టపడితే సంపన్నులవడం కష్టంకాదన్న విషయాన్ని గుర్తెరగాలన్నారు. అధికార యంత్రాంగం మొత్తం వెంటుంటారని, వారితోపాటుగా గరీబ్ బక్క ప్రాణిని నేనూ మీ వెంట ఉన్నానని ప్రోత్సహించే ప్రయత్నం చేశారు.
పాట పాడిన కెసిఆర్
అక్కినేని, సావిత్రి నటించిన తోడికోడళ్లు చిత్రంలోని ‘ఆడుతు పాడుతు పనిచేస్తుంటే’ పాటపాడి సిఎం కెసిఆర్ తనదైన శైలిలో భార్యాభర్తల్లో చైతన్యం తెచ్చే ప్రయత్నం చేశారు. గ్రామాభివృద్ధి విధి విధానాలు వివరిస్తూనే, రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడానికి కుటుంబం మొత్తం కష్టపడాలని ఉద్ఘాటించారు.